Krishna Kowshik
బిగ్ బాస్ రియాలిటీ షో కొంత మందికి నేమ్, ఫేమ్ తెచ్చిపెడుతుంది. దీంతో తాము సెలబ్రిటీలమని భావిస్తూ.. ఓవరాక్షన్ చేస్తున్నారు పలువురు కంటెస్టెంట్స్. తాజాగా బిగ్ బాస్ విన్నర్ ఒకరిపై కేసు నమోదైంది.
బిగ్ బాస్ రియాలిటీ షో కొంత మందికి నేమ్, ఫేమ్ తెచ్చిపెడుతుంది. దీంతో తాము సెలబ్రిటీలమని భావిస్తూ.. ఓవరాక్షన్ చేస్తున్నారు పలువురు కంటెస్టెంట్స్. తాజాగా బిగ్ బాస్ విన్నర్ ఒకరిపై కేసు నమోదైంది.
Krishna Kowshik
బిగ్ బాస్ షోలో అలరించిన కొంత మంది.. తాము సెలబ్రిటీలమని ఫీల్ అవుతూ పబ్లిక్‌గా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్.. టైటిల్ గెలవగానే, పోలీసులు వద్దని వారించిన వినకుండా ర్యాలీ చేపట్టి వివాదాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ అత్యుత్సాహమే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కారణమై.. అతడి అరెస్టుకు కారణమైంది. అంతక ముందు హిందీ బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్.. రేవ్ పార్టీకి పాము విషాన్ని సరఫరా చేసిన కేసులో నోయిడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఇతగాడు మరోసారి ఓవరాక్షన్ చేసి వార్తల్లో నిలిచాడు. ఓ యూట్యూబర్‌ను దారుణంగా కొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.
ఓ స్టోర్‌లో ఉన్న ‘మాక్స్ టర్న్’ యూట్యూబర్ సాగర్ ఠాకూర్ వద్దకు కొంత మందితో కలిసి వెళ్లిన ఎల్విష్.. అతడిపై దాడి చేశాడు. తనను కొట్టేందుకే అని తెలియక.. కలిసేందుకు వస్తున్నాడనుకుని లేచి వెల్కమ్ చెబుతుండగా.. సాగర్‌కు ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఇవ్వకుండానే చితకబాదారు. మోకాలితో తన్నడంతో పాటు చెంపను చెల్లుమనిపించారు. ఎల్విష్‌తో పాటు అతని వెంట వచ్చిన వ్యక్తులు అతన్ని దారుణంగా కొట్టారు. తిరిగి సాగర్ వారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అతడిని ఒంటరిని చేసి ఉతికేశారు ఎల్విష్.. అతడి గుంపు. ఈ వీడియోను బాధితుడు సాగర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
కాగా, బిగ్ బాస్ తాజా సీజన్ విన్నర్ మునావర్ ఫరూఖీ, ఎల్విష్ స్నేహంపై సాగర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతడ్ని కొట్టినట్లు సమాచారం. ‘ఎల్విష్ నన్ను కలవాలనుకుంటున్నాడని తెలిసినప్పుడు ఏదో మాట్లాడటానికి అనుకున్నాను. కానీ 10తో వచ్చి నాపై దాడి చేశాడు. తాగి వచ్చి.. బూతులు మాట్లాడుతూ కొట్టారు. ఎల్విష్ నా వెన్నెముక విరగ్గొట్టాలని చూశాడు. అతను చంపేస్తానంటూ బెదిరించాడు. నొప్పితో రాత్రంతా నిద్రలేకపోయాను’ అని వీడియోల్లో పేర్కొన్నాడు. ఎల్విష్ యాదవ్ పై తాను కేసు నమోదు చేశానని చెప్పారు. కొన్ని నెలలుగా, ఎల్విష్ ఫ్యాన్ పేజీలు తనపై ద్వేషం, ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, అవి తనను బాధపెట్టాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Full-Kalesh b/w You tuber Elvish Yadav and Real Maxtern yesterday night (With Audio) pic.twitter.com/s8DMjB1qOV
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 8, 2024
Real Maxtern Reply after this Kalesh Incident:pic.twitter.com/7ubeQZMvSV https://t.co/fjhAGtWCE5
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 8, 2024