iDreamPost
android-app
ios-app

డబ్బులు లాక్కొని.. యువకుడిని కొట్టి.. రెచ్చిపోయిన హిజ్రాలు..

  • Published May 21, 2022 | 11:05 AM Updated Updated May 21, 2022 | 11:05 AM
  • Published May 21, 2022 | 11:05 AMUpdated May 21, 2022 | 11:05 AM
డబ్బులు లాక్కొని.. యువకుడిని కొట్టి.. రెచ్చిపోయిన హిజ్రాలు..

కొంతమంది హిజ్రాలు పనులు చేసుకుంటూ బ్రతుకుతుంటే మరి కొంతమంది మాత్రం ఇంకా రోడ్డు మీద జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది డబ్బులు ఇవ్వడానికి వ్యతిరేకిస్తే హిజ్రాలు దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ యువకుడి నుంచి డబ్బులు లాక్కొని దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది.

గత రాత్రి సయ్యద్‌ షాబాజ్‌ అనే ఓ యువకుడు కృష్ణానగర్‌ వైపు నుంచి ఇందిరానగర్‌ వైపు బైక్‌పై వస్తుండగా ఇద్దరు హిజ్రాలు ఆ యువకుడిని ఆపి అతనితో మాట్లాడటం మొదలు పెట్టారు. ఆ యువకుడిని డబ్బులు అడగగా అతను ఇవ్వను అనడంతో జేబులో ఉన్న డబ్బులు లాక్కున్నారు. అతను ప్రశ్నించడంతో అతని మీద దాడి మొదలు పెట్టారు ఆ హిజ్రాలు. అతను తప్పించుకొని వెళ్తుండగా ఓ హిజ్రా రాయితో కొట్టడంతో సయ్యద్ కు గాయాలయ్యాయి.

దీంతో సయ్యద్ అదే రోజు రాత్రి ఇద్దరు హిజ్రాలు తనని కొట్టి డబ్బులు తీసుకున్నారని, గాయపరిచారని బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet