తరచూ ఎన్నికలకు సంబంధించిన వివాదాల్లో కోర్టులు కీలక తీర్పులు ఇస్తు ఉంటాయి. అయితే కొన్ని సార్లు కోర్టులు ఇచ్చే తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఎంతలా అంటే ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేల, ఎంపీల ఎన్నికలే చెల్లదు అన్నట్లు కోర్టులు సంచలన తీర్పులు ఇస్తుంటాయి. గతంలో ఏపీలో మడకశిర నియోజకవర్గంలో విషయంలో గెలిచిన టీడీపీ అభ్యర్ధిని ఎన్నికలను రద్దు చేసి.. వైసీపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించింది. తాజాగా తెలంగాణలో కొత్తగూడెం ఎమ్మెల్యేకు హైకోర్టు షాకిచ్చింది. ఆయన ఎన్నికను రద్దు చేసింది.
తెలంగాణ హైకోర్టు జోక్యంతో .. రాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు ఎన్నికల చెల్లదని ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన తరువాత లీడింగ్ లో ఉన్న వెంట్రావ్ ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. 2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ప్రత్యర్థి జలగం వెంట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. తాజాగా తీర్పును వెలువరించింది. వనమా ఎన్నికను రద్దు చేయడంతో పాటు.. తప్పుడు సమాచారం సమర్పించినందుకు గాను రూ.5 లక్షల జరిమాన సైతం విధించింది.