వాట్సాప్ అప్ డెేట్స్ పై వస్తున్న కొన్ని రూమర్స్ తరువాత, తాజాగా అప్ డేట్స్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఫీచర్స్ వల్ల ప్రొఫైల్ ఫొటో, లాస్ట్ సీన్, అబౌట్ వంటి అంశాలు కొంతమంది వ్యక్తులకు కనపించకుండా దాచిపెట్టే ఆప్షన్ ను తీసుకురాబోతోంది వాట్సాప్. ఇప్పటికే ఈ గోప్యతా సెట్టింగ్స్ బీటా వెర్షన్లో ఉండగా, రాబోయే అప్ డేట్స్ లో ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
పైన చెప్పిన అంశాల్లో ఇప్పటి వరకు కేవలం మూడు గోప్యతా ఎంపికలు ఉన్నాయి. కొత్త అప్ డేట్ తో “నా కాంటాక్ట్ లు మినహా” అనే అదనపు ఆప్షన్ ని చూస్తారు. దీనిద్వారా యూజర్లు తమ వివరాలను దాచిపెట్టాలనుకునే నిర్ధిష్ట కాంటాక్ట్ లను ఎంచుకునే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మీరు మీ “లాస్ట్ సీన్” ను కాంటాక్ట్ ల నుంచి దాచాలనే ఆప్షన్ ను ఎంపిక చేస్తే, అవతలి వ్యక్తుల ”లాస్ట్ సీన్” ను కూడా మీరు చూడలేరు. ఎకౌంట్ సెట్టింగ్స్ లోని గోప్యతా విభాగం నుంచి ఈ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.
మీ ప్రొఫైల్ ఫోటో, లాస్ట్ సీన్, అబౌట్ లోని సమాచారాన్ని కొంతమంది వ్యక్తుల నుంచి దాచాలనకుంటే… వాట్సాప్ లోని “సెట్టింగ్ లు> అకౌంట్స్> ప్రైవసీ” మెనూకు వెళ్ళాలి. ఇలా మీ కాంటాక్ట్ ల నుంచి ఎవరిని మినహాయించాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు. వీడియో కాలింగ్ ఫీచర్ కు కూడా కొన్ని అప్ డేట్స్ ను అందించింది వాట్సాప్. వీడియో కాల్ సమయంలో హోస్ట్ తో సహా నిర్దిష్ట వ్యక్తులను మ్యూట్ చేసే అవకాశం ఉంది.