iDreamPost
android-app
ios-app

పండంటి పాపకి జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత

  • Published Jun 11, 2022 | 7:16 AM Updated Updated Jun 11, 2022 | 7:25 AM
  • Published Jun 11, 2022 | 7:16 AMUpdated Jun 11, 2022 | 7:25 AM
పండంటి పాపకి జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత

అత్తారింటికి దారేది లాంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి చేరువైన ప్రణీత ఇక్కడ తక్కువ సినిమాలే చేసినా కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా మారింది. సినిమాలతో పాటే తన సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకుంది. కరోనా సమయంలో కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజును సింపుల్ గా వివాహం చేసుకుంది.

ఇటీవల కొన్ని నెలల క్రితం తను తల్లిని కాబోతున్నాను అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ప్రణీత తాజాగా పండంటి పాపకి జన్మనిచ్చింది. తన పాపతో హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు, డాక్టర్స్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆనందాన్ని అందరితో పంచుకుంది ప్రణీత.

ప్రణీత కొన్ని ఫోటోలు షేర్ చేసి.. ” కొన్ని రోజులుగా ఇంకా వాస్తవంగా ఉన్నట్టు అనిపించట్లేదు. పాప పుట్టినప్పటి నుంచి నాకు కలగానే ఉంది. గైనకాలజిస్ట్‌ అయిన తల్లి ఉండటం నా అదృష్టం. కానీ ఆమెకి మాత్రం మానసికంగా ఇది చాలా కష్ట సమయం. డాక్టర్‌ సునీల్‌ ఈశ్వర్‌, అతడి టీమ్‌ నాకు డెలివరీ సరిగ్గా జరిగేలా చూశారు. అలాగే డాక్టర్‌ సుబ్బు, అతడి బృందానికి నన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు. ఈ స్టోరీ మీకు చెప్పకుండా ఉండలేకపోయాను” అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో పాప ముఖాన్ని చూపించలేదు. ప్రణీత తల్లి అయిన సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet