iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో నిర్మాత బెదిరించాడు.. నా ఫ్యామిలీని కూడా..

  • Published Jun 17, 2022 | 4:30 PM Updated Updated Jun 17, 2022 | 4:30 PM
  • Published Jun 17, 2022 | 4:30 PMUpdated Jun 17, 2022 | 4:30 PM
ఇండస్ట్రీలో నిర్మాత బెదిరించాడు.. నా ఫ్యామిలీని కూడా..

పలు షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టి, సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, ఇటీవల కలర్ ఫోటో సినిమాతో భారీ హిట్ కొట్టింది యువ నటి చాందిని చౌదరి. ప్రస్తుతం యువ హీరో కిరణ్‌ అబ్బవరంతో కలిసి ‘సమ్మతమే’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా జూన్‌ 24న రిలీజ్ కాబోతుండటంతో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా సమ్మతమే సినిమా ట్రైలర్ ని KTR లాంచ్ చేశారు.

సమ్మతమే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి కలిసి అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేసారు ఇద్దరూ. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ఓ నిర్మాత మీ కెరీర్ ఆపేస్తా అని భయపెట్టాడంట అని అలీ చాందినిని అడిగాడు.

చాందిని చౌదరి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కనబడకుండా చేస్తానిన ఓ నిర్మాత బెదిరించాడు. నాతో పాటు నా ఫ్యామిలీని కూడా భయపెట్టాడు. కానీ చివరికి నాతో సైన్‌ చేయించుకున్న కాంట్రాక్ట్‌ వ్యాలిడ్‌ కాదని నాకు తెలిసింది. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలను కలవలేదా అని అలీ అడగగా.. ఎవరి దగ్గరకు వెళ్లను? నన్ను నేను బ్యాకప్‌ చేసుకోవడానికి నా దగ్గర ఏముంది? నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. చిటికెలో నన్ను మసి చేసేస్తారు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో చాందిని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే ఇంతకీ ఆ నిర్మాత ఎవరు అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. దీని గురించి పూర్తిగా తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

 

 

 

 

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio