iDreamPost
android-app
ios-app

సారా అలీ ఖాన్ పై ట్రోల్స్.. యాక్టింగ్ అంటే ఇదా అంటూ..

  • Published Mar 25, 2024 | 9:00 PM Updated Updated Mar 25, 2024 | 9:05 PM

Trolls On Sara Ali Khan: సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లు, హీరోలపై ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. అందుకు పెద్దగా కారణాలు కూడా అవసరం లేదు. అలాగే ఇప్పుడు సారా అలి ఖాన్ పై కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి.

Trolls On Sara Ali Khan: సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లు, హీరోలపై ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. అందుకు పెద్దగా కారణాలు కూడా అవసరం లేదు. అలాగే ఇప్పుడు సారా అలి ఖాన్ పై కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి.

  • Published Mar 25, 2024 | 9:00 PMUpdated Mar 25, 2024 | 9:05 PM
సారా అలీ ఖాన్ పై ట్రోల్స్.. యాక్టింగ్ అంటే ఇదా అంటూ..

గత కొన్నేళ్లుగా సినీ ప్రేక్షకుల్లో ఒక చర్చ నిరంతరం జరుగుతూనే ఉంది. అదే నేపోటిజం వర్సెస్ ట్యాలెంట్ అనే టాపిక్. ప్రేక్షకుల్లో ఒక వర్గం స్టార్ కిడ్స్ పై అవసరమైన దాని కంటే కాస్త ఎక్కువ నెగటివ్ ఫీలింగ్ ను పెంచేసుకున్నారు. స్టార్ హీరోల కొడుకులు లేదా కూతుళ్లు యాక్టింగ్ కెరీర్‌ను ఎంచుకుంటే, వారి సినిమాల పై లేదా నటనపై కాస్త ఎక్కువ విమర్శలు గుప్పించడం ఒక ఆనవాయితీగా మారింది. ఈ ఛాలెంజ్‌ని అధిగమించి ప్రేక్షకుల మన్ననలు పొందిన నటి అలియా భట్, గల్లీ బాయ్, రాజీ, రాకీ ఔర్ రానికీ ప్రేమ్ కహానీ వంటి చిత్రాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ మాత్రం తాజాగా ఓటీటీలో విడుదలైన తన సినిమాలోని నటనకి ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు.

సారా అలీ ఖాన్ తాజా చిత్రం ఏ వతన్ మేరే వతన్‌లో పాత్రకి తగినట్టు నటించలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఫిబ్రవరి 21 నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. సినిమాలో ఆమె నటనను చూసిన అభిమానులు సారా నటనని ప్రశంసించారు. అయితే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం పాత్రలో ఉన్న ఎమోషన్ కు సారా నటన సరిపోలేదని విమర్శిస్తున్నారు. నిజ జీవితంలో స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ స్థాపనను సవాలు చేసి స్వంతంగా ఒక ప్రైవేట్ రేడియో ఛానెల్‌ని ప్రారంభించిన ఉషా మెహతా పాత్రను ఏ వతన్ మేరే వతన్‌లో సారా పోషించారు. నిజానికి క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉంది. కానీ సారా నటన ఆ స్థాయిలో లేదని కొందరు విమర్శకులు కూడా అభిప్రాయ పడ్డారు.

అయితే సారా ఈ విమర్శలను సానుకూలంగా తీసుకొని ఒక నటిగా తన పరిధిని మెరుగుపరుచుకునే పనిలో పడితే మంచిదని మరి కొందరు నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి డిఫరెంట్ సినిమాను ఎంచుకున్నారు. అంటేనే సారా అలీ ఖాన్ ఒక విలక్షణ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారని, అలాంటి ప్రయత్నానికి మరింత కష్టం కూడా తోడైతే ఈరోజు విమర్శించిన వాళ్ళే మళ్ళీ పొగుడుతారని అంటున్నారు. మరి తన పై వచ్చిన ట్రోల్స్ కు సమాధానంగా సారా ఆలీ ఖాన్ ఎలాంటి సినిమాతో మళ్ళీ వస్తారో చూడాలి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/