iDreamPost
android-app
ios-app

IPL 2022 Final ఎమోష‌న‌లైన భార్య నటాషాను హార్డిక్ ఓదార్చిన వీడియో ట్రెండ్. వీరు చూశారా?

  • Published May 30, 2022 | 12:11 PM Updated Updated May 30, 2022 | 12:11 PM
  • Published May 30, 2022 | 12:11 PMUpdated May 30, 2022 | 12:11 PM
IPL 2022 Final ఎమోష‌న‌లైన భార్య నటాషాను హార్డిక్ ఓదార్చిన వీడియో ట్రెండ్. వీరు చూశారా?

ముంబై వ‌దులుకుంది. గుజరాత్ టైటాన్స్ కోరి కెప్టెన్ చేసింది. స‌రే, ధోనీ, రోహిత్, కేన్ లాంటి దిగ్గ‌జ కెప్టెన్లు ఉన్న ఐపీఎల్ సీజ‌న్ 2022లో హార్డిక్ పాండ్యా ఎంత‌వ‌ర‌కు రాణిస్తాడు? అంద‌రికీ డౌటే! దానికితోడు ఫీల్డ్ లో ఎమోష‌న‌ల్. మ్యాచ్ గ‌డుస్తున్న‌కొద్దీ, అటు టీం, ఇటు కెప్టెన్ ఇద్ద‌రూ సెటిల్ అయ్యారు. రాటుదేలారు. ఫైనల్స్ లో ఏం త‌డ‌బాటులేదు. ద‌ర్జాగా క‌ప్పుకొట్టుకెళ్లారు. అరంగేట్రం సీజన్‌లోనే టైటిల్‌ను కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది గుజ‌రాత్ టైటాన్స్. హార్దిక్‌ పాండ్యా కీలకమైన ఫైనల్లో, తానెంత గొప్ప ఆల్‌రౌండర్‌ అనేది మరోసారి చూపించాడు. అటు కెప్టెన్‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను క‌ట్ట‌డిచేశాడు. బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు ప‌డ‌గొట్టాడు, ఆ త‌ర్వాత‌ బ్యాటింగ్‌లో 34 పరుగులు చేశాడు.ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు పాండ్యా .

సీజన్‌ కి ముందు పాండ్యాపై విమర్శలు దారుణం. ఫామ్‌లో లేడు. ఇంక‌ జట్టును ఏం నడిపిస్తాడు? బౌలింగ్ చేయ‌లేడు. ఆల్‌రౌండర్‌గా పనికిరాడు. ఇంక‌ ఏం చేయ‌గ‌ల‌డంటూ సందేహించారు. ఆ సమయంలో పాండ్యాకు భార్య నటాషా స్టాంకోవిక్ ఫుల్ స‌పోర్ట్ నిచ్చింది. కొడుకు అగస్త్యతో కలిసి గుజరాత్‌ టైటాన్స్‌ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు హాజరైంది. ఎంకరేజ్ చేసింది. అక్క‌డా ఎమోష‌న‌లే. హార్దిక్‌ ఔటైతే, ముఖం మాడ్చుకోవ‌డం, వికెట్ ప‌డితే ఎగిరిగంతేయడం. ఫోర్ కొడితే కొడుతో క‌ల‌సి, సంతోషంతో ఎగిరి గంతేయడం.. ఇలా కెమేరాకు ఎప్పుడూ చిక్కుతూనే ఉంది.

ఇక‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ గెలవగానే, గ్రౌండ్‌లోకి పరిగెత్తుకొచ్చి పాండ్యాను గట్టిగా హగ్‌ చేసుకొంది. ఈ ఎమోష‌న‌ల్ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetgrandbetting girişEscortes BelgiqueHoliganbetGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibomHoliganbet