iDreamPost
android-app
ios-app

మా అమ్మని చెల్లిని అలా తిడతారా..? రిషి ఫ్యాన్స్‌పై మను ఫైర్..ముదిరిన ఫ్యాన్స్ వార్!

  • Published Jun 21, 2024 | 6:42 PMUpdated Jun 22, 2024 | 12:07 PM

Guppedantha Manasu Serial: గుప్పెడంతా మనసు సిరీయల్ ఫేమ్ మను అలియాస్ రవి శంకర్ రాథోడ్‌‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆ ఇంటర్వ్యూలో తన అమ్మని, అక్కని కుటుంబన్ని చాలా దారుణంగా బూతులు తిడుతున్నారని తన ఆవేదన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన ఫర్సనల్ లైఫ్ కు సంబంధించి కూడా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Guppedantha Manasu Serial: గుప్పెడంతా మనసు సిరీయల్ ఫేమ్ మను అలియాస్ రవి శంకర్ రాథోడ్‌‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆ ఇంటర్వ్యూలో తన అమ్మని, అక్కని కుటుంబన్ని చాలా దారుణంగా బూతులు తిడుతున్నారని తన ఆవేదన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన ఫర్సనల్ లైఫ్ కు సంబంధించి కూడా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

  • Published Jun 21, 2024 | 6:42 PMUpdated Jun 22, 2024 | 12:07 PM
మా అమ్మని చెల్లిని అలా తిడతారా..? రిషి ఫ్యాన్స్‌పై మను ఫైర్..ముదిరిన ఫ్యాన్స్ వార్!

సినీ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్ అంటే.. ఫ్యాన్స్ కు ఏ రేంజ్ లో అభిమానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తమకు నచ్చిన హీరోల విషయంలో అయితే ప్రాణమైన ఇచ్చేస్తారు. ముఖ్యంగా వారి మీద ఉన్న అభిమానంకు రక్తదానం,అన్నదానం వంటివి చేసేస్తుంటారు. అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉంటారు.కాగా, వారిలో ఒక్కొక్కరికి ఒక అభిమాని హీరో ఉంటారు. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అనే వార్ కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమాలా విషయానికొస్తే.. మా హీరో సినిమా బాగుంది, మా హీరో బాగా నటించడంటూ..వివిధ రకాలు గా వార్ జరుగుతుంటుంది. ఇక వీరి అభిమానం ఫీక్స్ కు వెళ్లిపోవడంతే.. కొన్నిసార్లు అసభ్యపదాలు కూడా కొంతమంది ఫ్యాన్స్ ఒకరిలో ఒకరు తిట్టుకుంటుంటారు. అయితే ఇప్పటి వరకు ఇలా సినీ ఇంస్ట్రీలో స్టార్ హీరోల కోసం జరిగే వార్ ను చూసి ఉంటాం. కానీ తాజాగా బుల్లితెర పై ఇద్దరూ హీరోల గురించి ఇప్పుడు నెట్టింట పెద్ద వార్ జరుగుతుంది. కాకపోతే వార్ అనేది వన్ సైడ్ మాత్రమే కొనసాగుతుంది. మరి, ఆ వివరాలేంటో చూసేద్దాం.

ప్రముఖ స్టార్ మా ఛానల్ లో ఎన్నో రోజులుగా ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ గురించి అందరికి తెలిసిందే. ఇక ఈ సిరీయల్ లో కొన్నాళ్లు పాటు రిషి స్థానంలో మను పాత్రను డాక్టర్ కమ్ యాక్టర్ రవి శంకర్ రాథోడ్‌‌ పోషించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా గా సోషల్ మీడియా వేదికగా రవి శంకర్ ను రిషి ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా దూషిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ పోస్టులపై రవి రియాక్ట్ కూడా అయ్యాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. కాగా, ఇప్పుడు ఈ కోల్డ్ వార్ మెల్లగా ముదిరి ఇప్పుడు పర్సనల్ ఎటాక్‌కి దారితీసింది. అది ఏ స్థాయి చేరిందంటే.. రిషి ఫ్యాన్స్ మను ఫ్యామిలీ, అతని వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ దారుణంగా బూతులు తిడుతున్నారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి శంకర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

ఇక ఆ ఇంటర్వ్యూలో  రవి శంకర్ మాట్లాడుతూ తనపైన తన వ్యక్తిగత జీవితంపై బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్లకి వార్నింగ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ‘గుప్పెడంత మనసు సీరియల్‌లో.. రిషి (ముఖేష్‌ గౌడ)కి కొన్ని రోజుల వరకు ఆరోగ్యం బాగోలేదు. దీంతో ఆ సిరీయల్ కథకి ఒక హీరో కావాలి. కనుకన్ను తీసుకొని వచ్చారు. ఇక హీరో లేకుండా కథని చేయలేరు. అందుకే నన్ను పెట్టారు. ఈ క్రమంలోనే నాకు నాకు లీడ్ రోల్ ఇస్తే.. నేను చేశాను. పైగా ఫ్యూచర్‌లో నాకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నేను కూడా బయటకు వస్తాను, అది నా వ్యక్తిగతం. కానీ, నేను ఆ సీరియల్‌లో చేస్తున్నానని చాలామంది నెటిజన్స్ బండబూతులు తిడుతున్నారు. ముఖ్యంగా.. మా అమ్మని అక్కని చెల్లిని, ఇంట్లో వాళ్లందరినీ బూతులు తిడుతున్నారు. అయితే ఆ బూతులు తిట్టేవాడు.. బూతు పోస్ట్‌లు పెట్టేవాడి ప్రొఫైల్ చూస్తే.. జీరో ఫాలోవర్స్. ఇక ఈ జీరో ఫాలోవర్స్ ఉన్నవాడు బయటకు వచ్చి మాట్లాడరా అంటే మాట్లాడలేడు. సరే నేను లైవ్‌లోకి వస్తా.. రా మాట్లాడు. నీ సామర్ధ్యం ఏంటో.. నా సామర్ధ్యం ఏంటో తేలిపోద్ది. రా తేల్చుకుందాం అని వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా..  నేను ఊరికే ఈ ఫీల్డ్ కి  రాలేదు. నేను ఈరోజు సీరియల్స్‌ మానేసినా కూడా.. నన్ను ఇంట్లో పెట్టి బ్రహ్మాండంగా చూసుకుంటారు.  ఎందుకంటే.. పది మంది డాక్టర్లు మా ఇంట్లో ఉన్నారు . నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్..  అంతేకానీ, డబ్బు కోసం చేయడం లేదు. ఈరోజు నేను మా ఇంట్లో డాడీ నేను ఏమీ చేయను ఇంట్లోనే కూర్చుంటానంటే.. కూర్చోబెట్టి ఏ లోటూ లేకుండా చూసుకుంటారు. నాకు ఆ స్తోమత ఉంది. నాకు డాక్టర్‌గా మంచి పేరు ఉంది. నా మీద కొన్ని ఆర్గైజేషన్స్ ఉంది. మాకు ఓ గుడి ఉంది.. ఆ గుడికి ధర్మకర్తలుగా ఉన్నాం. మా సొంత భూమిలో గుడి కట్టించాం. మా తండ్రి తరువాత మా అన్నయ్య నేనే కదా ఇవన్నీ చూసుకోవాలి. మేం ఎవడ్నీ దేహీ అని అడుక్కోవడం లేదు. ముఖ్యంగా  మేం సంపాదించిన దాన్నే దానం చేస్తున్నాం.

అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ మెంబర్‌ని నేను. ఇక అక్కడ ఆటో స్టాండ్ లేకుండా ఉండేది. మా ఫాదర్ గవర్నమెంట్‌తో మాట్లాడి ఆటో స్టాండ్ నిర్మించేట్టు చేశారు. అక్కడ ప్లేస్‌కి లీజు చెల్లిస్తూ ఆటో స్టాండ్ నిర్మించారు. మేం చేసిన దాన్ని గుర్తుపెట్టుకుని ఆ ఆటో యూనియన్‌లో మెంబర్‌ని చేశారు. వాళ్లు ఏ ఫంక్షన్ చేసినా నేను హాజరవుతాను. అలాంటిది ఈరోజు వీళ్లంతాన్ను తిడుతున్నారు. పైగా నేను వాళ్లకి ఒక్క ఫోన్ చేసి చెప్పానంటే చాలు. వాళ్లందరికీ బూతులు వచ్చు కదా.. నేనూ అలాగే చేస్తే వీళ్లకీ నాకూ తేడా ఏముంటుంది. అభిమానం పేరుతో ఇలా పర్సనల్ ఎటాక్ చేయడం ఎంతవరకూ కరెక్ట్’ అంటూ రవి శంకర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. మరి, రవి శంకర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి