iDreamPost
android-app
ios-app

గెస్ట్ హౌజ్ లో ప్రియురాలితో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య!

  • Published Oct 19, 2023 | 8:39 PM Updated Updated Oct 19, 2023 | 8:39 PM
  • Published Oct 19, 2023 | 8:39 PMUpdated Oct 19, 2023 | 8:39 PM
గెస్ట్ హౌజ్ లో ప్రియురాలితో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య!

ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లైన వ్యక్తులు పడక సుఖం కోసం ఎంతకైన తెగిస్తున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తీరా అసలు విషయం బయటపడడంతో కట్టుకున్న వాళ్లను అతి దారుణంగా హత్య చేస్తున్నారు. అంతా చేసి చేతులు దులుపుకుని ఏం తెలియదన్నట్లుగా సరికొత్త డ్రామాకు తెర లేపుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఓ భర్త భార్యకు తెలియకుండా మరో మహిళత వివాహేతర సంబందాన్ని కొనసాగించాడు. అయితే, భర్త తీరుపై కాస్త అనుమానం రావడంతో ఆ భార్య పక్కా ప్లాన్ తో భర్త ప్రియురాలితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాలోకి వెళ్తే.. ఏపీలోని గుంటూరు జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో కత్తిశ్రీను అనే వ్యక్తి కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

 ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఇకపోతే.. రాను రాను భర్త శ్రీను భార్యను పట్టించుకోవడమే మానేశాడు. దీంతో భార్య మెల్లగా భర్త తీరును పసిగట్టగా.. భర్త పరాయి మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని తెలుసుకుంది. ఇదే విషయంపై అనేక సార్లు పోలీసులు సైతం ఫిర్యాదు చేసింది. కానీ, భర్త ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు.

ఇక ఎలాగైన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లింది. ఇటీవల భర్త తన ప్రియురాలితో కలిసి ఓ గెస్ట్ హౌజ్ కు వెళ్లాడు. ఇదంతా తెలుసుకున్న అతని భార్య.. స్కెచ్ వేసి పోలీసుల సాయంతో ఆ గెస్ట్ హౌజ్ కు వెళ్లింది. వారున్న గది తలుపులు బద్దలు కొట్టిన భార్య.. ప్రియురాలితో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆ తర్వాత భర్త ప్రేయసిని ఆ మహిళ చితక్కొట్టింది. అనంతరం పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom