iDreamPost
android-app
ios-app

Gudivada 14 ఏళ్ల బాలుడితో గుడివాడ‌ వివాహిత ప‌రారీ, హైద‌రాబాద్ లో స‌హ‌జీవ‌నం, అరెస్ట్

  • Published Jul 27, 2022 | 7:16 PM Updated Updated Jul 27, 2022 | 7:17 PM
  • Published Jul 27, 2022 | 7:16 PMUpdated Jul 27, 2022 | 7:17 PM
Gudivada 14 ఏళ్ల బాలుడితో గుడివాడ‌ వివాహిత ప‌రారీ, హైద‌రాబాద్ లో స‌హ‌జీవ‌నం, అరెస్ట్

గుడివాడ‌ టౌన్ లో నివాస‌ముండే వివాహిత వ‌య‌స్సు 31 ఏళ్లు. క‌లుపుగోలుగా ఉండేది. చుట్టుప‌క్క‌లున్న పిల్ల‌ల‌తో ఫోన్ లో హౌసీ గేమ్స్ ఆడేది. ఎదురుంటి కుర్రాడు ఆమెకు అలాగే ఎట్రాక్ట్ అయ్యాడు. ఆ అబ్బాయి వ‌య‌స్సు 14 ఏళ్లు. తెలిసీ తెలియ‌ని వ‌య‌స్సు. ఇద్ద‌రి మ‌ధ్య చ‌నువు పెర‌గ‌డంతో ఆ అబ్బాయిని శారీర‌కంగా లోబ‌రుచుకుంది. ఈ కుర్రాడు చ‌దివేది 8వ త‌ర‌గ‌తి. ఈ వివాహిత చుట్టూ తిరుగుతూ, స్కూల్ కు కూడా వెళ్లేవాడు కాదంట‌. ఆమె ఇంటికి ప్ర‌తిరోజూ వెళ్లివ‌స్తుంటే పేరెంట్స్ మంద‌లించారు. ఆ ఇంటికి వెళ్లొద్ద‌ని గ‌ట్టిగానే వార్నింగ్ ఇవ్వ‌డంతో, ఈ సంగతిని ఆ వివాహిత‌కు చెప్పాడు.

ఇక ఈ కుర్రాడు త‌నకు దూర‌మ‌వుతాడ‌ని భావించిన ఆ వివాహిత‌, అత‌కి ఏదో చెప్పి, ఈనెల 19న హైద‌రాబాద్ కు తీసుకెళ్లింది. ఆమెకు న‌లుగురు పిల్ల‌లు. వాళ్ల‌ను వ‌దిలేసి, భ‌ర్త‌కు తెలియ‌కుండా హైద‌రాబాద్ చెక్కేసింది. బాలాన‌గ‌ర్ లో ఆ కుర్రాడితో స‌హ‌జీవ‌నం మొద‌లుపెట్టింది.

ఇలా కొన్నిరోజుల త‌ర్వాత ఈ కుర్రాడికి పేరెంట్స్ గుర్తుకొచ్చారు. గుడివాడ వెళ్ల‌డానికి కావ‌ల్సిన మ‌నీ కోసం తెలిసిన వారికి మెసేజ్ పెట్టాడు. ఎవ‌రూ రియాక్ట్ కాలేదు. చేసేదిలేక పేరెంట్స్ తాను హైద‌రాబాద్ లో ఉంటున్న విషయాన్ని చెప్పాడు. అప్ప‌టికే వివాహిత గుట్టు క‌నిపెట్టారు జిల్లా ఎస్పీ జాషువా. ప్ర‌త్యేక బృందాలు కుర్రాడు మాట్లాడుతున్న సెల్ ఫోన్ లొకేష‌న్ ఆధారంగా వారున్న ఇంటికి వెళ్లారు.

మంగ‌ళ‌వారం ఇద్ద‌రినీ అదుపులోకి తీసుకొని బుధ‌వారం గుడివాడ‌కు తీసుకొచ్చారు. కుర్రాడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైన‌ర్ తో శృంగారం చేసినందుకు పోక్సో చ‌ట్టం ప్ర‌కారం కేసులు పెట్టారు. కిడ్నాప్ కేసుకూడా న‌మోదైంది. నిందుతురాలికి కోర్టు రిమాండ్ విధించింది

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş