iDreamPost
android-app
ios-app

GST రేట్లు స‌వ‌ర‌ణ‌, రేట్లు పెరిగిన‌, త‌గ్గిన వ‌స్తువుల జాబితా

  • Published Jul 01, 2022 | 2:26 PM Updated Updated Jul 01, 2022 | 2:27 PM
GST రేట్లు స‌వ‌ర‌ణ‌, రేట్లు పెరిగిన‌, త‌గ్గిన వ‌స్తువుల జాబితా

జీఎస్టీ రేట్ల‌ను కేంద్రం మళ్లీ స‌వ‌రించింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో, 47వ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం చండీగఢ్‌లో ముగిసింది.

క్యాసినోను రేస్ కోర్స్, ఆన్‌లైన్ గేమింగ్ నుంచి విడ‌దీయాల‌న్న గోవా అభ్య‌ర్ధ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని, రాష్ట్రాల నుండి మరిన్ని ఇన్‌పుట్‌ను ఆధారంగా, జూలై 15 లోగా తన నివేదికను సమర్పించాలని మంత్రుల బృందాన్ని కౌన్సిల్ ఆదేశించింది. బుధవారం చండీగఢ్‌లో జరిగిన రెండు రోజుల 47వ GST కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న సిఫార్సులతో చాలా వ‌స్తులపై టాక్స్ పెర‌గ‌నుంది. జూలై 18, 2022 నుండి అమలులోకి వచ్చేలా, పన్ను రేట్లలో మార్పులను కౌన్సిల్ ఆమోదించింది.

ఏ వ‌స్తువుల రేట్లు పెరుగ‌తాయంటే?
LED ల్యాంప్స్ నుంచి సోలార్ వాట‌ర్ హీట‌ర్ల వ‌ర‌కు రేట్లు పెర‌గ‌నున్నాయి.

బ్యాంక్ చెక్ బుక్ చెక్ బుక్ మ‌నం ఆర్డ‌ర్ పై బ్యాంక్ విధించే ఛార్జిమీద 18శాతం జీఎస్టీని విధించారు. .


పంపులు, యంత్రాలు

మ‌నం బావుల నుంచి వాట‌ర్ తోడ‌టానికి, సంప్ ల‌నుంచి వాట‌ర్ ను ట్యాంక్ కి ఎక్కించ‌డానికి వాడే centrifugal pumps, deep tube-well turbine pumps, submersible pumpsల‌పై ఇప్పుడు 12శాతం జీఎస్టీని 18శాతానికి పెంచారు. విత్తనాలు, ధాన్యం, పప్పులను శుభ్రపరిచే యంత్రాల‌పైన 18శాతానికి జీఎస్టీని పెంచారు.


సోలార్ వాటర్ హీటర్లు
ఇప్ప‌టిదాకా సోలార్ హీట‌ర్ల‌పై 5శాతం జీఎస్టీ ఉంది. దాన్ని 15శాతానికి పెంచారు.

ఆసుపత్రి పడకలు

ICUని మినహాయిస్తే, ఒక పేషెంట్ కి రోజుకు రూ. 5000 కంటే ఎక్కువ రూం రెంట్ ను వ‌సూలు చేస్తే, ఆ పెరిగిన మొత్తంమీద 5 శాతం టాక్స్ ను విధిస్తారు.

హోటల్ గదులు
ఇప్ప‌టిదాకా వెయ్యిలోపు రూం రెంట్ ఉంటే జీఎస్టీ ప‌రిధిలోకి వ‌చ్చేదికాదు. ఇప్పుడు వాటిమీద 12శాతం టాక్స్ వేశారు.
ప్యాకేజ్డ్ ఫుడ్ మీద 5శాతం టాక్స్ వేస్తే, LED లైట్ల మీద టాక్స్ ను 18శాతానికి పెంచారు. లెద‌ర్ గూడ్స్ మీద‌ టాక్స్ ను 12శాతానికి పెంచారు.

ఏ వ‌స్తువుల రేట్లు త‌గ్గుతాయంటే?

బ్యాట‌రీ ఉన్నా లేకున్నా, ఎల‌క్ట్రిక్ వేహిక‌ల్స్ పై జీఎస్టీ 5శాత‌మే. ఆమేర‌కు వేహిక‌ల్స్ రేట్లు త‌గ్గ‌నున్నాయి. ర‌క్ష‌ణ‌రంగానికి జీఎస్టీని త‌గ్గించారు. ఆర్థోపెడిక్ ఉపకరణాలు(Orthopedic Appliances), గాయ‌ప‌డిన‌, కాళ్లూ చేతులు విరిగిన‌వారికి వాడే ఉప‌క‌ర‌ణాల‌పై ఇప్పుడున్న 12శాతం జీఎస్టీని 5శాతానికి త‌గ్గించారు. ఇలాగే జీఎస్టీ కౌన్సిల్ రోప్ వే ట్రావిలింగ్ కు ప్రోత్స‌హ‌మిచ్చింది. రోప్‌వే రైడ్స్ మీద టాక్స్ త‌గ్గించారు.