iDreamPost

వీడియో: సర్ మమ్మల్ని వదిలి వెళ్లొద్దు! ఈ ప్రభుత్వ టీచర్ పై చిన్నారుల ప్రేమ చూశారా?

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మై శ్రీ గురువేనమః అన్న శ్లోకం ఉంది. పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తరువాత గురువు ప్రధాన పాత్ర పోషిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ రోజుల్లో..

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మై శ్రీ గురువేనమః అన్న శ్లోకం ఉంది. పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తరువాత గురువు ప్రధాన పాత్ర పోషిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ రోజుల్లో..

వీడియో: సర్ మమ్మల్ని వదిలి వెళ్లొద్దు! ఈ ప్రభుత్వ టీచర్ పై చిన్నారుల ప్రేమ చూశారా?

తల్లిదండ్రులు జన్మనిచ్చినా..జీవితంలో ఎలా ముందుకు సాగాలి అన్న నేర్పించేది గురువే. అందుకే పేరెంట్స్ తర్వాత స్థానాన్ని పాఠాలు చెప్పే పంతులకు ఇస్తాం. కేవలం లెసెన్స్ మాత్రమే కాదు.. జీవితపు పాఠాలు నేర్పిస్తుంటారు. లైఫ్‌లో ఎదుర్కొనే ఒడిదుడుకులను తట్టుకుని గమ్య స్థానం దిశగా ఎలా పయనించాలో చెబుతారు. అందుకే స్టూడెంట్.. టీచర్ కు మధ్య రిలేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఏ సక్సెస్ పర్సన్ అయినా ఆ క్రెడిట్ సగం తల్లిదండ్రులకు ఇస్తే, మరికొంత తనకు పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులకు ఇస్తుంటారు. అయితే ఈ రోజుల్లో చదువు కమర్షియల్ రంగులు పులుముకుంది. ప్రభుత్వ బడుల్లో కూడా విద్య నామ్ కే వాస్తేగా మారిపోయిందన్న అపవాదు ఉంది. అందుకే ప్రైవేటు బడులు పుట్టుకొస్తున్నాయని అంటుంటారు.

ఇందులో నిజ నిజాలు పక్కన పెడితే.. బడిలో పిల్లలు మెచ్చే పంతులు, పంతులమ్మ కచ్చితంగా ఒకరు ఉంటారు. వారితో అన్ని విషయాలు షేర్ చేసుకునేలా ఉంటుంది. పై తరగతులకు వెళుతుంటే వారిని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ ఉంటుంది కానీ.. నిత్యం మన కళ్ల ముందే కనిపిస్తుంటే అంత ఎమోషనల్ అనిపించదు. అలా కాకుండా ట్రాన్ ఫర్ కావడం, లేదా రిటైర్ అవుతుంటే.. తట్టుకోలేకపోతుంటారు స్టూడెంట్స్. తమకు ఇష్టమైన సార్ వెళ్లిపోతే వద్దని విద్యార్థులు కంటతడి పెట్టిన ఘటనలు చూశాం. తాజాగా తెలంగాణలో ఇటువంటి భావోద్వేగపూరిత ఘటన వెలుగు చూసింది. బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయుడ్ని వెళ్లొద్దంటూ విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు. తమను వదిలి పెట్టి వెళ్లొద్దంటూ ఏడ్చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ భావోద్వేగ పూరితమైన సంఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పోలుమల్ల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు సైదులు. అక్కడ చాలా కాలంగా టీచర్‌గా వ్యవహరించాడు. కాగా, ఇటీవల ఆయనకు బదిలీ అయ్యింది. ఈ కారణంగా అతడు పిల్లలకు చాక్లెట్స్ పంచాడు. అయితే తమకు ఇష్టమైన సార్ వెళ్లిపోతుంటే.. వెక్కి వెక్కి ఏడ్చారు విద్యార్థులు. సార్ మీరు వెళ్లొద్దు.. ఇక్కడే ఉండండి అంటూ కాళ్ల మీద పడి ఇక్కడే ఉండండి అంటూ బ్రతిమాలాడారు. ఈ చర్యను చూసి షాక్ తిన్న ఉపాధ్యాయుడు..వారిని ఓదార్చేందుకు ప్రయత్నించినప్పటికీ అతడి వల్ల కాలేదు. ఎట్టకేలకు వారికి నచ్చజెప్పి అక్కడి నుండి ముందుకు సాగారు ఈ తెలుగు టీచర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి