మొత్తానికి గూగుల్ పిక్సెల్6 ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి వస్తోంది. పిక్సెల్ ఫోన్ దాదాపుగా 2ఏళ్ళ విరామం తరువాత తిరిగి దేశీయ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. వస్తూనే సైలెంట్ గా 6ఎ ఫోన్ ను తీసుకొచ్చింది. దీని ధరను సైతం ప్రకటించేసింది గూగూల్.
దీని ధర రూ.43,999 ఉండగా, ప్రస్తుతానికి ఒక్క వేరియంట్ తో రెండు రంగుల్లో మాత్రమే విడుదల చేస్తోంది గూగుల్. ఈ ఫోన్ అమ్మకాలు ఫ్లిప్ కార్ట్ వారి బిగ్ సేవింగ్ డేస్ ద్వారా జులై 23 నుంచి జరగనున్నట్లు తెలుస్తోంది.
పిక్సెల్ 6ఎ పై బ్యాంకు ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా రూ.4,000 డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంది. ఈఎంఐ ద్వారా నెలకు కేవలం రూ.1,504 తో ఈ ఫోన్ ను మీ సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. వీటితో పాటుగా పిక్సెల్ 6ఎ పై క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయాన్ని సైతం అందిస్తోంది.
6.14 అంగుళాల ఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే దీని సొంతం. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు గూగుల్ టెన్సార్ తో వస్తున్న ఈ ఫోన్ 12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఫీచర్ కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరాలో 8 మెగాపిక్సెల్ ప్రంట్ కెమెరా సెన్సార్ ఉంది. 4410 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నప్పటికీ ఛార్జింగ్ ను ఫోన్ తో పాటుగా ఇవ్వకపోవడం గమనార్హం.