Keerthi
ఇప్పుడంతా ఏఐ ట్రెండ్ అనేది నడుస్తున్న విషయ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా క్ ప్రియులకు గూగుల్ జెమినిని సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకి అదేమిటంటే..
ఇప్పుడంతా ఏఐ ట్రెండ్ అనేది నడుస్తున్న విషయ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా క్ ప్రియులకు గూగుల్ జెమినిని సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకి అదేమిటంటే..
Keerthi
ఇప్పుడంతా ఏఐ యుగం నడుస్తోంది. ఈ క్రమంలోనే.. ఎక్కడ చూసిన అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ట్రెండ్ నే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. కాగా, కృత్రిమ మేథస్సులో పిలిచే ఈ సరికొత్త టెక్నాలజీ.. ఇప్పటికే వివిధ రంగాల్లో జోరుగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఈ ఏఐ సేవలు మానవాళికి ఎంతగానో ఉపాయోగపడతాయని దీని సృష్టికర్తలు పేర్కొంటున్నారు. కాగా, ఇప్పటికే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కొత్తగా టెలివిజన్ రంగంలోకి ప్రవేశ పెడుతున్నవిషయం తెలిసిందే. ఇక ఇలాంటి సమయంలో.. తాజాగా టెక్ ప్రియులకు గూగుల్ జెమినిని సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకి అదేమిటంటే..
టెక్ ప్రియులు ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్న ఆశలు ఇన్నాళ్లుకు ఫలించాయి. ఎందుకంటే.. గూగుల్ జెమిని ఏఐ యాప్ ను గూగుల్ సంస్థ తాజాగా విడుదల చేసింది. అయితే గూగుల్ జనరేటివ్ లాంచ్ చేసిన ఈ ఏఐ చాట్ బాట్ జెమిని మొబైల్ యాప్ లో ఇంగ్లీష్ తో పాటు మరో 9 భారతీయ భాషల్లో విడుదల చేసింది. అయితే వాటిలో.. హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ చాట్ జీపీటీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక వీటిని జెమినీ అడ్వాన్స్ డ్ లో తొమ్మిది స్థానిక భాషలను గూగుల్ అనుసంధానం చేస్తుంది. అలాగే గూగుల్ జెమినీ అడ్వాన్డ్స్‌లో కొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టారు. కాగా, ఇందులో కొత్తగా డేటా విశ్లేషణ చేయడం, ఫైల్ అప్ లోడింగ్, ఇంగ్లీష్ లో గూగుల్ సందేశాలతో జెమినితో చాట్ చేసే అవకాశం కూడా ఈ ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా.. ఈ యాప్ వలన ఉద్యోగం చేసే వాళ్లకి కూడా మంచి ఉపాయోగకరంగా ఉంటుంది.
ఇక కస్టమర్లకు ఎప్పటికప్పుడు సపోర్టు అందించడానికి ఏఐ దేశంలోని అన్ని భాషల్లో టైప్ చేయడానికి, మాట్లాడానికి ఉపాయోగపడుతుంది. అంతేకాకుండా.. భారతదేశంతో పాటు టర్కీ, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాల్లో కూడా ఈ జెమిని మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఇక ఈ మొబైల్ యాప్ లాంచ్ గురించి తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. అలాగే అందులో ఏదైనా టాపిక్ గురించి మీరు సెర్చ్ చేయాలంటే అందులో టైప్ చేయవచ్చు. ఇంక వాయిస్ అసిస్టెంట్‌ను ఉపయోగించొచ్చు. దానితో పాటు ఫోటో సాయంతో కూడా వెతికే సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు. దీంతో పాటు మరిన్ని అదనపు సదుపాయాల కోసం జెమిని అడ్వాన్స్ అనేది ప్రీమియం వెర్షన్ అందుబాటులో ఉంది. కాకాపోతే ఈ వెర్షన్ కు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని, పైగా ఇందులో ఫైల్ అప్‌లోడ్, డేటా అనలైజ్ వంటి కొత్త ఫీచర్లు కూడా ఉంటాయని తెలిపారు.