iDreamPost
android-app
ios-app

రాక్షసులు VS మనుషులు – ఇదో ఆట

  • Published Oct 21, 2020 | 6:06 AM Updated Updated Oct 21, 2020 | 6:06 AM
రాక్షసులు VS మనుషులు – ఇదో ఆట

బిగ్ బాస్ 4 ఎలిమినేషన్లలో ఎవరు ఉండబోతున్నారో మొన్న లిస్ట్ రెడీ కావడంతో ఇప్పుడిక మళ్ళీ టాస్కుల గోల మొదలయ్యింది. వెరైటీగా ఉండేలా ప్లాన్ చేసేందుకు నిర్వాహకులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు. దానికి తగ్గట్టే పార్టిసిపెంట్స్ కూడా తమ యథాశక్తి ఓవరాక్షన్ తో రక్తి కట్టేలా విపరీతంగా కృషి చేస్తున్నారు. డ్రామా ఎంత హద్దులు దాటుతున్నా ఇంతకన్నా వేరే మార్గం లేదు కాబట్టి అలా కానిచ్చేస్తున్నారు. నిన్న కొంటె రాక్షసులు VS మంచి మనుషులు అనే గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఎప్పుడో బాహుబలి కాలం నాటి టైంలో బిగ్ బాస్ పురం అనే ఊరిలో నివసించే మనుషులను కొంటె రాక్షసులు వచ్చి బాగా డిస్టర్బ్ చేస్తుంటారు. కానీ మనుషులు మాత్రం సంయమనం కోల్పోకుండా ఓపిగ్గా సర్దిచెప్పుకుని వీలైతే వాళ్ళను మార్చే ప్రయత్నం కూడా చేయాలి.

కొంటె రాక్షసుల టీమ్ లో హారిక, అవినాష్, అఖిల్, మెహబూబ్, అరియనా ఉండగా మంచి మంచి మనుషుల బృందంలో మోనాల్, సోహైల్, దివి, అమ్మ రాజశేఖర్, లాస్య, నోయెల్, అభిజిత్ ఉన్నారు. గార్డెన్ ఏరియాలో పది తలల రాక్షసుడి బొమ్మ ఒకటి పెట్టారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన పనులను మంచి మనుషులు పూర్తి చేయాలి. వాటిని చెడగొడతారు రాక్షసులు. అలా జరగకుండా కాపాడుకుంటూ ఆ పనిని పూర్తి చేసి బొమ్మలో రెండు తలలు పగలగొట్టి ఓ రాక్షసుడిని పట్టుకోవాలి. దొరికినవాళ్ళు మనుషులుగా మారతారు. టాస్క్ మొత్తం పూర్తయ్యే లోగా ముగ్గురు రాక్షసులను మనుషులుగా మార్చగలిగితే విజేతలుగా నిలవొచ్చు. అరియనా చేసిన రచ్చ మాములుగా లేదు. హారిక, అవినాష్ లు అమ్మ రాజశేఖర్ తో ఐసు ముక్కల కామెడీ చేసుకున్నారు.

మొత్తం రెండు టాస్కులు జరిగాయి. మొదటిదాంట్లో స్విమ్మింగ్ పూల్ లో ఉన్న దండలను తీసుకుని యాభై దండాలు అల్లాలి. దీన్ని మనుషులు శుభ్రంగా నెరవేర్చి అఖిల్ ని మనిషిగా మార్చుకున్నారు. తర్వాత రెండోది మట్టితో వంద ప్రమిదలు తయారు చేయడం. మనుషులు టీమ్ ఏకంగా నూటా అరవై చేసింది. మనిషిని మార్చుకునే క్రమంలో దేత్తడి హారిక బిగ్ బాస్ ముందుకు వెళ్లి కన్నీరు పెట్టుకుంది. మొత్తానికి మనుషులను రాక్షసులు గట్టిగానే ఏడిపించారు. ఇది ఈ రోజు కూడా కొనసాగనుంది. ఎలిమినేషన్ల ప్రక్రియ ముదిరి పాకాన పడుతుండటంతో వీకెండ్ లో ఎవరు బయటికి వస్తారా అనే ఆసక్తి నెలకొంది. విపరీతంగా బిగ్ బాస్ ని అభిమానించే వాళ్లకు తప్ప ఇప్పుడు జరుగుతున్న గేమ్ అంతా చాలామటుకు అతికి పరాకాష్టగానే నిలుస్తోంది

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişMeritkingcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbetHoliganbet Giriş