తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. వివిధ స్కీమ్ ల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఆర్ధిక సాయం అందిస్తోంది. ఇలా కేవలం ప్రజలనే కాకుండ రైతులను సైతం తెలంగాణ ప్రభుత్వం ఆదుకుటుంది. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇక రైతుల కోసం కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఏడాదికి రెండు సార్లు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. తాజాగా కేసీఆర్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది.
తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుపడి సాయం కోసం రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎకరానికి రూ. 10 వేలు రెండు దఫాలుగా అందిస్తోన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు ఖాతాల్లో ఎకరాకు రూ. 5 వేల చొప్పున జమ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు రైతు బంధు పథకం కింద రూ.10వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఏడాదికి గాను జూన్ 26 నుంచి రైతు బంధు సహాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. 5 ఎకరాలు పైబడిన రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు.
తాజాగా… ఈనెల 24 నుంచి తిరిగి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. తొలుత ఐదు ఎకరాల లోపు పొలం ఉన్న 55,130 మంది రైతుల అకౌంట్లలో రూ.83.30 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. అలానే 27న 5.11 ఎకరాల వరకు 49,990 మంది రైతుల ఖాతాల రూ. 128.56 కోట్లు జమ చేశారు. అలానే జూన్ 28న 5.26 ఎకరాల వరకు భూములున్న 49,990 మంది రైతుల ఖాతాల్లో రూ.136.54 కోట్లు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 63.35 లక్షల మంది రైతులకు చెందిన 1.13 కోట్ల ఎకరాలకు రూ. 5,694.90 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. మరి.. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ రైతు బంధు పథకం అందిస్తున్న ఫలితాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వారికి రూ.లక్ష సాయం అందజేయనున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్లై చేసుకొండి!