iDreamPost
iDreamPost
సంక్రాంతి తర్వాత ఆ స్థాయి కాకపోయినా చెప్పుకోదగ్గ సెలవులు దొరికే సీజన్ దసరా కాబట్టి సినిమాల రిలీజులకు అనువైన సమయంగా చూస్తారు నిర్మాతలు. ఈసారి పండగకు లాంగ్ వీకెండ్ తోడవ్వడంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ ఇద్దరూ ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టుకుని ముఖాముఖీ పోరుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 దీనికి వేదిక కానుంది. మెగాస్టార్ మూవీ పోస్ట్ పోన్ అవ్వొచ్చనే ప్రచారాలకు చెక్ పెడుతూ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పటికే కన్ఫర్మేషన్ వచ్చింది. ఇవాళ నయనతార పాత్రను పరిచయం చేసిన లుక్ లోనూ మరోసారి డేట్ ని నొక్కి వక్కాణించారు. సో ఎలాంటి మార్పు ఉండదు.
ఇక ది ఘోస్ట్ సైతం మంచి అంచనాలను మోస్తోంది. ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. నాగార్జునకు సోలో హిట్టు దక్కి చాలా కాలమయ్యింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఏ మేరకు ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో చూడాలి. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ ని పరిచయం చేస్తున్న స్వాతిముత్యం సైతం అదే తేదీకి వచ్చేందుకు ఉవ్విళూరుతోంది. కొత్త దర్శకుడు, ఇమేజ్ లేని చిన్న హీరోయిన్ తో తీసిన ఈ ఎంటర్ టైనర్ మీద సితార సంస్థకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఇద్దరు సీనియర్ మోస్ట్ హీరోలతో తలపడటం సేఫా కాదాని చూసుకోవడం లేదు. గ్యారెంటీ హిట్ అనే ధీమాతో పోటీకి సై అన్నట్టు కనిపిస్తోంది.
మొత్తానికి ట్రయాంగిల్ వార్ తప్పదని అర్థమైపోయిందిగా. దీనికి వారం ముందు మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1 వచ్చి ఉంటుంది. ఒకవేళ దానికి పాజిటివ్ టాక్ వస్తే ఏడు రోజులే గ్యాప్ కాబట్టి రేస్ లో ఉన్నట్టుగానే పరిగణించాలి. దానికి తోడు అదే రోజు బాలీవుడ్ మూవీ విక్రమ్ వేదా పందేనికి సిద్ధపడుతోంది. మెట్రో నగరాల్లో అందులోనూ మల్టీ ప్లెక్సులో దీని ప్రభావం అంత ఈజీగా కొట్టిపారేయలేం. ఇంత టఫ్ కాంపిటేషన్ మంచిదే అయినా ప్రేక్షకులకు మరీ ఎక్కువ ఆప్షన్లు ఉంటే దాని ఎఫెక్ట్ ఓపెనింగ్స్ మీద పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరో ఒకరు నష్టపోవాల్సి ఉంటుంది. సరే ఆడియన్స్ కోణంలో చూస్తే ఇలా జరగడమూ ఒకరకంగా మంచిదే అనుకోవాలి