iDreamPost
android-app
ios-app

వీడియో: పవన్ కు శివరాజ్ కుమార్ షాక్.. తానే OG అంటూ..!

వీడియో: పవన్ కు శివరాజ్ కుమార్ షాక్.. తానే OG అంటూ..!

తెలుగులో శివరాజ్ కుమార్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ, కన్నడలో ఆయన ఒక స్టార్ హీరో. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్నే ఈ శివరాజ్ కుమార్. ఓటీటీలు వచ్చిన తర్వాత తెలుగు వాళ్లు కూడా కన్నడ సినిమాలు చూడడం మొదలు పెట్టారు. అలా శివరాజ్ కుమార్ కు తెలుగులో కూడా కాస్తో కూస్తో ఫాలోయింగ్ వచ్చింది. అలాంటిది.. ఇప్పుడు శివరాజ్ కుమార్ ఏకంగా పవన్ కల్యాణ్ కే షాకిచ్చాడు. తానే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటున్నాడు.

పవన్ కల్యాణ్- సుజీత్ కాంబినేషన్ లో #OG అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్ బాయ్ గా సుజీత్ ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో తీస్తాడు అంటూ ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్లకు శివరాజ్ కుమార్ షాకిచ్చాడు. తాజాగా శివరాజ్ కుమార్ నటించిన పాన్ ఇండియా మూవీ ఘోస్ట్ కి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ లాస్ట్ లో శివరాజ్ కుమార్ తానే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ డైలాగ్ చెప్తాడు. సినిమా పేరు ఘోస్ట్ అయినా కూడా ఓజీ అని, ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని చెప్పడంతో ఒకింత షాకిచ్చాడనే చెప్పాలి.

ఇంక ఈ టీజర్ విషయానికి వస్తే.. ఒక టీమ్ ఒక వ్యక్తిని ప్రాణాలతో తీసుకురావాలని వెళ్తుంటాయి. వాళ్లు వెతుకుతున్న వ్యక్తి వారికోసం ఎదురుచూస్తూ ఉంటాడు. వాళ్లంతా గన్నులు గురిపెడితే హీరో మాత్రం.. ఏకంగా ట్యాంకర్ చూపిస్తాడు. టీజర్ పరంగా చాలా బాగుందనే చెప్పాలి. ఇందులో హైలెట్ ఏంటంటే.. శివరాజ్ కుమార్ పానీపూరీని విస్కీలో ముంచుకు తింటాడు. నిజంగా ఈ ఎలివేషన్ నెక్ట్స్ లెవల్ అంటున్నారు. లాస్ట్ లో “మీరు ఎంత మందిని అయితే గన్నుతో భయపెట్టారో.. నేను అంతకంటే ఎక్కువ మందిని నా కళ్లతో భయపెట్టాను. వాళ్లంతా నన్ను ఓజీ అని పిలుస్తారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్” అని చెప్తాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş