iDreamPost
android-app
ios-app

దేవుడు కలలో కనిపించి గొయ్యి తవ్వమన్నాడు.. తీరా చూస్తే..

ఏదైనా పేరుగాంచిన గుడి ప్రాస్తశ్యం గురించి చెప్పేటప్పుడు.. దాని చరిత్ర గురించి చెబుతూ ఉంటారు పెద్దలు, పండితులు. ప్రతి గుడి ఏర్పాటు వెనుక ఓ గాధ కచ్చితంగా ఉంటుంది. దేవుడు కలలో కనిపించి తాను అక్కడ దేవాలయాన్ని నిర్మించాడని చెప్పాడంటూ కథ ఉంటుంది.

ఏదైనా పేరుగాంచిన గుడి ప్రాస్తశ్యం గురించి చెప్పేటప్పుడు.. దాని చరిత్ర గురించి చెబుతూ ఉంటారు పెద్దలు, పండితులు. ప్రతి గుడి ఏర్పాటు వెనుక ఓ గాధ కచ్చితంగా ఉంటుంది. దేవుడు కలలో కనిపించి తాను అక్కడ దేవాలయాన్ని నిర్మించాడని చెప్పాడంటూ కథ ఉంటుంది.

దేవుడు కలలో కనిపించి గొయ్యి తవ్వమన్నాడు.. తీరా చూస్తే..

చిన్నప్పుడు అమ్మమ్మ, తాతయ్యలు కథలు చెబుతుండగా.. వాటిని వింటూ హాయిగా నిద్రపోయే వాళ్లు పిల్లలు. ముఖ్యంగా పురాణ, ఇతి హాస గాధలు చెప్పేటప్పుడు కాస్తంత కల్పితాన్ని జోడించి చెప్పేవారు. అలాగే దేవాలయాలు, వాటి ప్రస్థానం గురించి చెప్పేటప్పుడు.. కచ్చితంగా ఓ కథ చెబుతుంటారు. ఆ దేవుడు అక్కడ ఎలా వెలిశాడు.. అని చెప్పేందుకు.. గ్రామస్థుల కలలోకి వచ్చి తాను అక్కడ ఉన్నానని, బయటకు తీసి గుడి కట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి.. నిత్య పూజలు చేయాలని చెప్పాడని, నిజంగా వెళ్లి చూస్తే విగ్రహం కనిపించిందని, అప్పటి నుండి అక్కడ కొలువు తీరాడని చెబుతుంటారు. ఇంచు మించు అన్ని ఆలయాలకు ఇటువంటి ఓ ప్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది.

ఆ కథే నిజంగా మన ముందుకు సాక్షాత్కరిస్తే.. గూస్ బంప్స్ రావడం ఖాయం కదా. కానీ అటువంటి సంఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. బెల్తంగడి తాలూకా తెక్కారి గ్రామంలోని బత్రా బైల్‌లోని ఓ ముస్లిం వ్యక్తికి వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో కృష్ణుడి విగ్రహం ఉన్నట్లు మరో వ్యక్తికి కల వచ్చింది. వెంటనే అతడి అనుమతి తీసుకుని.. కలలో వచ్చిన ప్రాంతంలో తవ్వించగా.. నిజంగానే కృష్ణుడి విగ్రహం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి టెక్కారిలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అయితే తన భూమి ప్రక్కనే ఉన్న ముస్లిం వ్యక్తి హమద్ బావాకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో కృష్ణుడు విగ్రహం ఉన్నట్లు కల వచ్చింది.

వెంటనే ఈ విషయాన్ని గ్రామ ప్రజలకు తెలియజేశారు. జ్యోతిష్కులను కూడా సంప్రదించారు. అయితే అది ముస్లిం వ్యక్తి భూమిలో ఉండటంతో అతడికి విషయం తెలియజేశారు. అతడు అంగీకరించడంతో.. జేసీబీతో భూమిని తవ్వారు. పది అడుగులు తవ్విన తర్వాత విరిగిన కృష్ణుడి విగ్రహం బహిర్గతమైంది. విగ్రహం దొరికిన స్థలంలో గుడి కట్టించాలని గ్రామస్థులు నిర్ణయించగా.. అందుకు హమద్ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని విడిచిపెట్టాడు. హమద్ ఆ స్థలాన్ని వారసత్వంగా పొందాడు. అయితే వందల ఏళ్ల క్రితం.. టిప్పు సుల్తాన్ ఈ గుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గ్రామంలో కొన్నాళ్ల వరకు ఆ గుడి ఉండగా.. ఇప్పుడు భూ స్తాపితం అయ్యింది. దాన్ని అన్వేషిస్తుండగా.. ఇప్పుడు బయటపడింది. అయితే ఈ భూమి హమద్ కు వారసత్వంగా వచ్చింది. ఇది ఆక్రమిత భూమి అని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి