iDreamPost
android-app
ios-app

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు : అన్నీ ఎగ్జిట్‌ పోల్స్ ది ఒకటే మాట

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు : అన్నీ ఎగ్జిట్‌ పోల్స్ ది ఒకటే మాట

మరో 13 గంటల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌటింగ్‌ ప్రారంభం కాబోతోంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటిగ్‌ ప్రక్రియ ప్రాంభంకానున్న తరుణంలో తాజాగా వెళ్లడైన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు రాజకీయ పార్టీలు, అభ్యర్థులతోపాటు.. ప్రజల్లోను ఉత్కంఠకు తెరతీశాయి. వివిధ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ప్రకటించారు. అన్ని సంస్థల ఫలితాలు దాదాపు సమానంగా ఉండడం విశేషం.

టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతోందని సర్వే సంస్థలు చెప్పుకొచ్చాయి. ఎంఐఎం రెండో స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ రెండు పార్టీలకు గత ఎన్నికల కన్నా తక్కువ సీట్లు రాబోతున్నాయని వెల్లడించాయి. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 99 సీట్లు గెలవగా.. ఈసారి అన్ని సంస్థలు టీఆర్‌ఎస్‌ 68–82 స్థానాలు రాబోతున్నట్లు ప్రకటించాయి. ఎంఐఎం పోయిన ఎన్నికల్లో 44 సీట్లు గెలవగా.. ఈ సారి సంఖ్యను స్వల్పంగా తగ్గించాయి. ఎంఐఎంకు 32–41 సీట్లు రావొచ్చని అంచనాలు వేశాయి. ఇక బీజేపీకి 25–35 సీట్లు రాబోతున్నట్లు లెక్కలు వేశాయి. గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్‌ పార్టీ జీహెచ్‌ఎంసీలో బోణి కొడుతుందని అన్ని సర్వేలు పేర్కొన్నాయి. ఇక టీడీపీని ఏ సర్వే సంస్థ పరిగణలోకి తీసుకోలేదు.

Read Also : అద్భుతాలు జరుగుతాయి.. 31న పార్టీ వివరాలు వెల్లడిస్తా : రజనీకాంత్‌

వివిధ సంస్థల ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఇలా..

సంస్థ       టీఆర్‌ఎస్‌     ఎంఐఎం   బీజేపీ    కాంగ్రెస్‌/ఇతరులు

పీపుల్స్‌ పల్స్‌   68–78   38–42   25–35   01–05

ఆరా సర్వే            78         41          28       03

సీపీఎస్‌ సర్వే    82–96    32–38    25–35   03–05

జన్‌కీ బాత్‌          74          40          31       05

ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల సరళి ద్వారా ఈ సారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎక్స్‌ అఫిషియో సభ్యులు కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌ గెలుచుకునే సీట్ల సంఖ్య 70కు కొంచెం అటుఇటుగా ఉన్నాయని చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీలో 150 కార్పొరేటర్లు, 45 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యులున్నారు. మొత్తం సంఖ్య 195 కాగా.. మేయర్‌ పీఠం గెలుచుకోవాలంటే 98 మంది సభ్యుల బలం ఉండాలి.

Read Also : రైతుల పోరాటం పాల‌కుల‌పైనా? క‌ంపెనీల‌పైనా?

45 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యులలో టీఆర్‌ఎస్‌కు 31 మంది సభ్యులున్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున  మంది కార్పొరేటర్లు గెలిస్తే ఆ పార్టీ బలం 98కు చేరుకుంటుంది. అప్పుడు టీఆర్‌ఎస్‌ ఒంటిరిగానే మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులను గెలుచుకుంటుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల లెక్క తప్పి.. టీఆర్‌ఎస్‌ పార్టీ 67 కన్నా తక్కువ డివిజన్లలో గెలిస్తే మాత్రం ఆ పార్టీకి మద్ధతు అవసరం అవుతుంది. అప్పుడు ఎంఐఎం పార్టీతో కలసి మేయర్‌ పీఠాన్ని పంచుకోవలసి రావచ్చు లేదా ఒకటి రెండు సీట్లు తక్కువైతే ఇతర్లును చేర్చుకోవచ్చు కానీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఆ ఆ పరిస్థితి వచ్చేలా లేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా ఎగ్జాట్‌ ఫలితాలు వస్తాయా..? లేదా ఎవరూ ఊహించని ఫలితాలు వెల్లడవుతాయా..? అనేది రేపు తేలనుంది.

Read Also : పువ్వాడ వ‌ర్సెస్ నారాయ‌ణ – తెర‌మీదికి పాత పంచాయితి