Ghayal : ఆవేశానికి ప్రతీకగా బెస్ట్ కమర్షియల్ డ్రామా

రఫ్ గా ఉండే తన ఫేస్ వాటికి సూట్ కాదని సన్నీడియోల్ కు తెలుసు. అందుకే స్క్రిప్ట్ ల ఎంపికలో జాగ్రత్తగా ఉన్నాడు. అప్పుడు కలిశాడు రాజ్ కుమార్ సంతోషి. 1982 నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న తనకు దర్శకుడు కావాలని లక్ష్యం.అలా రాసుకున్న కథే ఘాయల్. ముందు కమల్ హాసన్-మిథున్ చక్రవర్తి కాంబినేషన్ లో తీయాలనుకున్నారు.

రఫ్ గా ఉండే తన ఫేస్ వాటికి సూట్ కాదని సన్నీడియోల్ కు తెలుసు. అందుకే స్క్రిప్ట్ ల ఎంపికలో జాగ్రత్తగా ఉన్నాడు. అప్పుడు కలిశాడు రాజ్ కుమార్ సంతోషి. 1982 నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న తనకు దర్శకుడు కావాలని లక్ష్యం.అలా రాసుకున్న కథే ఘాయల్. ముందు కమల్ హాసన్-మిథున్ చక్రవర్తి కాంబినేషన్ లో తీయాలనుకున్నారు.

సమాజంలో కుటుంబంలో అన్యాయం జరిగినప్పుడు హీరో ఆవేశంతో తిరగబడితేనే ప్రేక్షకులకు ఉత్సాహం వస్తుంది. మాస్ సినిమాల్లో ఇది ప్రధాన సూత్రం. దశాబ్దాలు దాటినా దీన్ని అనుసరిస్తున్న దర్శకులు ఎందరో. ఓ మంచి ఉదాహరణ చూద్దాం. 1990. అప్పటికే ధర్మేంద్ర వారసుడిగా సన్నీ డియోల్ కు మంచి పేరుంది. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు ప్రేమకథలతో అద్భుత విజయాలు అందుకుని జెండాలు పాతేశారు. రఫ్ గా ఉండే తన ఫేస్ వాటికి సూట్ కాదని సన్నీడియోల్ కు తెలుసు. అందుకే స్క్రిప్ట్ ల ఎంపికలో జాగ్రత్తగా ఉన్నాడు. అప్పుడు కలిశాడు రాజ్ కుమార్ సంతోషి. 1982 నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న తనకు దర్శకుడు కావాలని లక్ష్యం.

అలా రాసుకున్న కథే ఘాయల్. ముందు కమల్ హాసన్-మిథున్ చక్రవర్తి కాంబినేషన్ లో తీయాలనుకున్నారు. కానీ నిర్మాతలు భయపడి ముందుకు రాలేదు. సంజయ్ దత్ కూడా విన్నాడు. కానీ ఏదో అనుమానంతో నో చెప్పేశాడు. అలా ఇది చక్కర్లు కొడుతుండగా ఫైనల్ గా సన్నీ డియోల్ వద్దకు వచ్చి ఆగింది. ఇండస్ట్రీలో ఎందరో సంశయించిన ఆ సబ్జెక్టులో దమ్ము ధర్మేంద్రకు కనిపించింది. తనే నిర్మిస్తానని రెడీ అయ్యారు. కొడుకుని ఇది పెద్ద స్థాయికి తీసుకెళ్తుందన్న నమ్మకం ఆయనది. హీరోయిన్ గా మీనాక్షి శేషాద్రి ఎంపికయ్యింది. అన్నయ్య క్యారెక్టర్ కోసం రాజ్ బబ్బర్ ఫిక్స్ అయ్యారు. ఇటీవలే స్వర్గస్తులైన బప్పీలహరి చక్కని పాటలతో ఆల్బమ్ రెడీ చేశారు.

ఇందులో సన్నీ బాక్సర్ గా నటించారు. ఆయనకు శిక్షణ ఇచ్చింది విజు ఖోటే. షోలే గబ్బర్ సింగ్ గ్యాంగ్ లో పాపులారిటీ తెచ్చుకున్న నటుడతడు. అన్నయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్న యువకుడి కథగా రాజ్ కుమార్ సంతోషి ఘాయల్ ని తెరకెక్కించారు. 1990 జూన్ 22 విడుదలైన ఘాయల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ధర్మేంద్ర ఊహించిన దానికన్నా గొప్ప విజయం దక్కించుకుని సన్నీకి గొప్ప మార్కెట్ సృష్టించింది. ఏడు ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకోవడం అప్పట్లో రికార్డు. ముప్పై ఏళ్ళ క్రితమే 17 కోట్లకు పైగా వసూళ్లతో ఆ ఏడాది రెండో టాప్ గ్రాసర్ గా నిలిచింది ఘాయల్. అమీర్ ఖాన్ దిల్ మొదటి స్థానం అందుకుంది. దీన్నే తెలుగులో శ్రీకాంత్ తో గమ్యంగా 1998లో రీమేక్ చేస్తే దారుణంగా ఫ్లాప్ కావడం ఫైనల్ ట్విస్టు

Also Read : Crime Movies : కలెక్షన్లు కురిపించిన మర్డర్ల కహానీలు – Nostalgia

Show comments