iDreamPost
android-app
ios-app

Gargi Movie సాయిపల్లవి ‘గార్గి’ రిపోర్ట్

  • Published Jul 15, 2022 | 11:26 AM Updated Updated Jul 15, 2022 | 12:01 PM
Gargi Movie సాయిపల్లవి ‘గార్గి’ రిపోర్ట్

నిన్న ది వారియర్ హడావిడిలో పడిపోయాం కానీ ఇవాళ మరో రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో మొదటిది గార్గి కాగా రెండోది మై డియర్ భూతం. నిన్న ప్రత్యేకంగా మీడియాకు ప్రీమియర్లు వేశారు. విరాట పర్వం కోసం విస్తృతంగా ప్రమోషన్లు చేసినప్పటికీ దానికి తగ్గ ఫలితం అందుకోలేకపోయిన సాయిపల్లవి ఇప్పుడీ గార్గి కోసం కూడా చాలా కష్టపడింది. మనసుకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ లో ఇదీ ఒకటని చెప్పుకున్న ఈ కేరళ నటి కోసమే థియేటర్ కు వెళ్లేవాళ్లున్నారు. సీరియస్ కాన్సెప్ట్ తో రూపొంది ట్రైలర్ పరంగా బాగానే ఆకట్టుకున్న గార్గి మరి ప్రేక్షకులు మెప్పు పొందే విధంగా ఉందా లేక ఇంకేదైనా ట్విస్ట్ ఇచ్చిందా రిపోర్ట్ లో చూద్దాం.

టీచర్ గా పని చేసే గార్గి(సాయిపల్లవి)కి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఓ రోజు తండ్రిని పోలీసులు చెప్పాపెట్టకుండా అరెస్ట్ చేస్తారు. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేసే అతని మీద బాలిక అత్యాచారం కేసు నమోదవుతుంది. అయితే అతన్ని ఎక్కడ ఉంచారో గార్గికి చెప్పరు. దీంతో ఆయన జాడ కోసం ఆమె చేయని ప్రయత్నమంటూ ఉండదు. అవమానాలు అడ్డంకులు ఎదురవుతాయి. న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది. ఇదీ అంత సులువుగా ఉండదు. ఒకదశలో తాను ఓడిపోతానేమోననేంత దారుణంగా పరిస్థితులు మారిపోతాయి. అయినా పట్టువదలని గార్గి ఈ యుద్ధంలో గెలిచిందా, జన్మనిచ్చినవాడు నిజంగా తప్పు చేశాడా అనేదే అసలు స్టోరీ.


గౌతమ్ రామచంద్రన్ తీసుకున్న పాయింట్ బాగుంది. ఎంటర్ టైన్మెంట్ కు ఏ మాత్రం చోటు లేకపోయినా కమర్షియల్ అంశాలకు స్పేస్ దొరక్కపోయినా నిజాయితీగా రాసుకున్న కథను హృద్యంగా తెరకెక్కించాడు. సెకండ్ హాఫ్ నెమ్మదించినప్పటికీ ఇలాంటి థీమ్స్ ఉన్న సినిమాలు ఇష్టపడేవాళ్ళను గార్గి మెప్పిస్తుంది. క్లైమాక్స్ ట్విస్టు బాగుంది. కాకపోతే సన్నివేశాలు స్లోగా వెళ్లడం రెగ్యులర్ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. అందులోనూ థియేటర్ కన్నా ఇలాంటి కంటెంట్ ఓటిటికి ఫిట్ అనిపిస్తుంది. సాయిపల్లవి పెర్ఫార్మన్స్ ఆశించినట్టే బెస్ట్ అనిపించగా మిగిలిన క్యాస్టింగ్ కూడా బాగా చేశారు. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేని గార్గి ఒక వర్గం ప్రేక్షకులకే రీచ్ అవుతుంది