iDreamPost
android-app
ios-app

బన్నీ పవన్ ఫ్యాన్స్ మధ్య మళ్ళీ అగాథం

  • Published Jan 08, 2020 | 7:49 AM Updated Updated Jan 08, 2020 | 7:49 AM
  • Published Jan 08, 2020 | 7:49 AMUpdated Jan 08, 2020 | 7:49 AM
బన్నీ పవన్ ఫ్యాన్స్ మధ్య మళ్ళీ అగాథం

మొన్న జరిగిన అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్షర్ట్ తాలూకు సెగలు ఇంకా చల్లారడం లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఇవి చెలరేగుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ తన స్పీచ్ లో కట్టె కాలే వరకు చిరంజీవి అభిమానినని ఆ తర్వాత అంతగా ఇష్టపడేది రజనీకాంత్ అని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. నిజానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పేరు ఆశించారు. నిజానికి బన్నీ ఎవరి పేరైనా చెప్పొచ్చు. ఖచ్చితంగా పవన్ పేరు చెప్పాలన్న రూల్ ఏమి లేదు.

అయితే తన స్పీచ్ మధ్యలో అరుస్తున్న పవర్ స్టార్ అభిమానులను సంతృప్తిపరిచేందుకు పవన్ కళ్యాణ్ పేరుని గారు అని ఉపమానం లేకుండా ప్రస్తావించడం ఇక్కడ అసలు అగ్గిని రాజేసింది. తమ హీరోని గారు లేకుండా పవన్ కళ్యాణ్ అంటూ సంభోదించడం ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యింది. అంతే ఇక అప్పుడు మొదలుపెట్టిన ట్రోలింగ్ మూడు రోజులు అవుతున్నా ఆపడం లేదు. అందులోనూ అల్లు అర్జున్ తనకు అభిమానులు లేరు ఆర్మీ ఉందని చెప్పుకోవడాన్ని కూడా కామెడీ చేస్తున్నారు.

గతంలో ఇదే బన్నీ పడి పడి లేచే మనసు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎవరినైనా సరే గారు అని పిలవాలని నొక్కి మరీ చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో తీసుకొచ్చి అప్పటి సంస్కారం ఏమయ్యిందని ఆధారంతో సహా నిలదీసి మరీ దాడి చేస్తున్నారు. వీళ్ళకు ధీటుగా బన్నీ ఫ్యాన్స్ సైతం మాటల ఎన్ కౌంటర్లను ఉదృతం చేశారు.

ఇవి చాలవు అన్నట్టు నాన్న అల్లు అరవింద్ కు పద్మశ్రీ ఇవ్వాలని అల్లు అర్జున్ కోరడం ట్రోలింగ్ కు ఇంకో మెటీరియల్ ఇచ్చినట్టు అయ్యింది. ఒక నిర్మాతగా బిజినెస్ ఆధారంగా సినిమాలు నిర్మించడం తప్ప ఆయన పరిశ్రమ కు కాని సమాజానికి కాని చేసిందేమని అడుగుతున్నారు. ఆ మధ్య లో డిజే ఫంక్షన్ లో చెప్పను బ్రదర్ తో మొదలైన బన్నీ-పవన్ ఫ్యాన్స్ ల ఆగాధం శ్రిరెడ్డి వివాదం తర్వాత సద్దుమణిగినా ఇప్పుడు మళ్ళి మొదటికే వచ్చినట్టు కనిపిస్తోంది. ఇది ఎప్పుడు సమిసిపోతుందో ఇలా రాజుకుంటూనే ఉంటుందో రాబోయే పరిణామాలే చెబుతాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet