iDreamPost
android-app
ios-app

చిన్న విషయంలో గొడవ.. విద్యార్థుల మధ్య గ్యాంగ్‌ వార్‌!

  • Published Oct 11, 2023 | 6:51 PM Updated Updated Oct 11, 2023 | 6:51 PM
  • Published Oct 11, 2023 | 6:51 PMUpdated Oct 11, 2023 | 6:51 PM
చిన్న విషయంలో గొడవ.. విద్యార్థుల మధ్య గ్యాంగ్‌ వార్‌!

చిన్న విషయం విద్యార్థుల మధ్య తీవ్రమైన గొడవకు దారి తీసింది. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అది కూడా నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కొట్టుకున్నారు. ఫేర్వేల్‌ పార్టీ సందర్భంగా పాట విషయంలో ఈ గొడవ చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో ఈ సంఘటన జరిగింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా.. అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కాలేజీ ఉంది.

ఈ కాలేజ్లో ఈ నెల 5వ తేదీన ఫేర్వేల్‌ పార్టీ జరిగింది. పార్టీలో పాల్గొన్న విద్యార్థులు ఆటా,పాటతో ఎంతో ఎంజాయ్‌ చేస్తూ ఉన్నారు. ఈవెంట్‌ ఎంతో ప్రశాంతంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో ఓ పాట విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టింది. బీఏ, బీకామ్‌ విద్యార్థులు ఒకరితో ఒకరు గొడవకు దిగారు. అప్పటి ఆ గొడవ సద్ధుమణిగింది. అయితే, మంగళవారం సాయంత్రం మళ్లీ కొంతమంది గొడవకు దిగారు. రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డు మీద ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

ఈ గొడవతో స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు దీనిపై సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. గొడవను ఆపారు. రెండు గ్రూపుల్లోని విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. మరి, పాట విషయంలో గొడవ కారణంగా రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న విద్యార్థులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio