iDreamPost
android-app
ios-app

గుడ్‌న్యూస్‌: పెట్రో రేట్లు త‌గ్గుతున్నాయి, ఎంతంటే!

  • Published May 21, 2022 | 7:29 PM Updated Updated May 21, 2022 | 7:29 PM
గుడ్‌న్యూస్‌: పెట్రో రేట్లు త‌గ్గుతున్నాయి, ఎంతంటే!

పెట్రోల్ రేట్ల‌ను రోజురోజుకూ పెంచుకొంటూ పోయిన కేంద్రం ఇప్పుడు శాంతించిన‌ట్లే క‌నిపించింది. అసంతృప్తితో ఉన్న వాహనదారులకు తీపికబురు అందించింది కేంద్రం. రేట్ల‌ను ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.

పెట్రోల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ రూ. 8, డీజిల్‌ పై రూ. 6 తగ్గిస్తున్నట్లు తెలిపింది కేంద్రం. అంటే ఆ మేర‌కు పెట్రోల్‌ పై లీటర్‌కు రూ. 9.5, డీజిల్‌పై రూ.7 తగ్గుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్ర‌క‌టించారు.

గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 200 సబ్సిడీనిచ్చింది కేంద్రం. కాక‌పోతే ఒక‌టే కండీష‌న్. పీఎం ఉజ్వల్‌ యోజన కింద గ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్న వారికి మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుంది. అదికూడా ఏడాదికి 12 సిలిండర్ల వరకే. దేశంలో ఉ‍జ్వల పథకం కింద 9 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. వీళ్లంద‌రికీ కాస్త ఊర‌టే.