iDreamPost
android-app
ios-app

Aadhar Update:ఆధార్‌ తీసుకుని పదేళ్లు దాటిందా? ఇలా చేస్తే ఉచితంగా మార్పులు!

  • Published Mar 14, 2024 | 6:58 PM Updated Updated Mar 14, 2024 | 6:58 PM

భారత గుర్తింపు కార్డు ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం మార్చి 14 వరకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఆధార్ అప్ డేట్ కోసం మరో సారి గడువు పెంచింది.

భారత గుర్తింపు కార్డు ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం మార్చి 14 వరకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఆధార్ అప్ డేట్ కోసం మరో సారి గడువు పెంచింది.

  • Published Mar 14, 2024 | 6:58 PMUpdated Mar 14, 2024 | 6:58 PM
Aadhar Update:ఆధార్‌ తీసుకుని పదేళ్లు దాటిందా? ఇలా చేస్తే ఉచితంగా మార్పులు!

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో సారి గడువు పొడిగించింది. ఇప్పటికే ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి14తో ముగియడంతో.. మరోసారి గడువు పొడిగించింది. ఇప్పటికే రెండు సార్లు ఆధార్ అప్ డేట్ ను చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు అప్ డేట్ కోసం మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. దీనితో జూన్ 14వరకు ఉచితంగా ఆధార్ లో మార్పులు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేంద్ర మొదటిగా 2023 మార్చి15 వరకు గడువును.. డిసెంబర్ 14వరకు పొడిగించింది. ఆ తర్వాత 2024 మార్చి 14 వరకు అప్ డేట్ చేసుకునేందుకు.. ఛాన్స్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఈ గడువును పొడిగించింది. ప్రజలు కూడా వారి వారి ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకునేందుకు.. ఇంట్రెస్ట్ చూపించడంతో.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారంతా.. వారి వారి డెమోగ్రఫిక్‌ వివరాలు.. ఖచ్చితంగా అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. మరి దీనికోసం ఎటువంటి ప్రాసెస్ ను ఫాలో అవ్వాలో.. ఏ ఏ పత్రాలను ధ్రువీకరణ కోసం ఉపయోగించుకోవాలో చూద్దాం. దీనికోసం UIDAI వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి లేటెస్ట్‌ గుర్తింపు కార్డు, అడ్రస్‌ వివరాలను సబ్మిట్‌ చేయాలి.

కాగా దీనిలో గుర్తింపు కార్డు కింద.. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ లాంటి వాటిని ధ్రువీకరణ పత్రాలుగా .. ఉపయోగించుకోవచ్చు. అలాగే, టీసీ, మార్క్‌షీట్‌, పాన్‌/ఇ-ప్యాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి కూడా గుర్తింపు ధ్రువీకరణ పత్రాలుగా ఉపయోగపడతాయని తెలిపింది. వీటితో పాటు మూడు నెలలకు మించని విద్యుత్‌, నీటి, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్స్ ను కూడా.. ధ్రువీకరణ పత్రంగా వినియోగించ్చుకోవచ్చని UIDAI పేర్కొంది. కాకపోతే, ఉచిత సేవలు మాత్రం ‘మై ఆధార్‌’ పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.