iDreamPost
iDreamPost
అకస్మాత్తుగా వచ్చిపడే ఖర్చులకు, ఏదైనా కొనాలన్నా, పిల్లల ఫీజుకట్టాలన్నా పర్సనల్ లోన్ చాలా ఉపయోగం. మిగిలిన లోన్స్ తోపోలిస్తే చాలా స్పీడుగా లోన్ వస్తుంది. మంచి ట్రాక్ రికార్డు ఉంటే జస్ట్ 10 నిమషాల్లోనే ఎకౌంట్ లోకి లోన్ మనీ వచ్చిపడుంది. కాని రుణదాతకు క్రెడిట్ రిస్క్ ఎక్కువ. మిమ్మల్ని, మీ ఫైనాల్సియల్ ట్రాక్ రికార్డును నమ్మి లోన్ ఇవ్వాలి. అదే హౌస్ లోన్ అనుకోండి. ఇళ్లు ఎదురుగా కనిపిస్తుంది. కాల్ లోన్ అయితే, మీరు కట్టకపోతే కార్ తీసుకెళ్లిపోవచ్చు. మరి పర్సనల్ లోన్? అందుకే మంచి జీతమున్నా అందరికీ పర్సనల్ లోన్ రాదు. మీ పర్సనల్ లోన్ అర్హతను పెంచుకోవడానికి మూడు స్మార్ట్ టెక్నిక్స్ ఉన్నాయి.
క్రెడిట్ రేటింగ్ 750 దాటి ఉండాలి
బ్యాంకర్లు సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరున్నవారికి పర్సనల్ లోన్ ఇవ్వడానికి ఇష్టపడతారు. స్కోరు బాగుందంటే వాళ్లు రెగ్యులర్ గా కట్టేవారు, ఆర్థికంగా క్రమశిక్షణ ఉన్నవారని నమ్ముతారు. ఈఎంఐ డిఫాల్ట్ అయ్యే అవకాశం తక్కువ.
క్రెడిట్ రేటింగ్ 700కన్నా తక్కువగా ఉన్నా లోన్స్ వస్తాయి. వాళ్లు కడతారో లేదో అన్న భయంతో ఎక్కువ క్రెడిట్ రిస్క్‌ను భర్తీ చేయడానికి , అధిక వడ్డీ రేటును విధిస్తారు. దానివల్ల మనకు చాలా నష్టం. అందుకే మంచి క్రెడిట్ స్కోర్‌ను మెయింటైన్ చేయాలి. ఎప్పుడు లోన్ అవసరం వస్తుందో తెలియదు కదా. అలాగని నెలలోనే క్రెడిట్ స్కోర్ పెరగదు. ప్రతినెలా చెక్ చేసుకొంటే ఎక్కడ దెబ్బతింటున్నామో తెలుస్తుంది.
వినియోగదారులు ప్రతి క్రెడిట్ బ్యూరోల నుండి సంవత్సరానికి ఒకసారి ఉచిత క్రెడిట్ రిపోట్స్ ను పొందేందుకు అర్హులు కాబట్టి, మీరు ప్రతి మూడునెలలకొకసారి ప్రతి నాలుగు క్రెడిట్ బ్యూరోల నుండి ఉచిత క్రెడిట్ రిపోర్ట్ ను తీసుకోవచ్చు. క్రెడిట్ మంత్రిలాంటి వెబ్ సైట్లు మీకు ఫ్రీగా క్రెడిట్ రిపోర్ట్స్ నిస్తాయి.
మీ EMIలను గడువు తేదీలోపు తిరిగి చెల్లించి, క్రెడిట్ కార్డ్ బకాయిలు లేకుండా చూసుకోవాలి. క్రెడిట్ కార్డు చేతిలో ఉందికదా అని పదేపదే వాడకూడదు. క్రెడిట్ కార్డువాడకం 10- 30% లోపు ఉంచుకొంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పర్సనల్ లోన్ వస్తుంది.
మీ EMI స్థోమత ఎంత?
మీకున్న నెలవారీ ఆదాయంలో 60% లోపు, కొత్త లోను EMIతో సహా, మొత్తం నెలవారీ రుణ చెల్లింపులుంటేనే పర్సనల్ లోన్ ఎక్కువగా శాంక్షన్ అవుతుంది. ఈమార్కును దాటారా? తిరస్కరణ తప్పదు.
కాబట్టి EMI స్థోమతను అంచనా వేసేటప్పుడు, నెలవారీ ఖర్చులు, బీమా ప్రీమియంలు, అద్దెతోపాటు రాత్రిరాత్రికి వచ్చిపడే ఖర్చులను కూడా లెక్కవేసుకోవాలి. ఇస్తున్నారుకదాని పర్సనల్ లోన్ తీసుకొని కట్టకపోతే, మొత్తం మీ క్రెడిట్ రేటింగ్ దెబ్బతింటుంది.
ఎక్కువగా లోన్ ఎంక్వైరీలు వద్దు
లోన్ ఆఫర్ ఉందని కనిపించిన చోటల్లా మీరు ఎంక్వైరీలు చేస్తే , మీ క్రెడిట్ యోగ్యతను గుర్తించేందుకు బ్యాంకులు మీ క్రెడిట్ రిపోర్ట్ ను ఇస్తాయి. తరచు లోన్ ఎంక్వైరీలు చేస్తే క్రెడిట్ బ్యూరోలు మిమ్మల్ని అనుమానిస్తాయి. మీకు లోన్ అవసరం ఎక్కువగా ఉందని, ఎక్కడైనా లోన్ తీసుకోవాలని తహతహలాడుతున్నారని అనుకుంటాయి. మీరు లోన్ ఎంక్వైరీ చేసిన ప్రతి సందర్భంలో మీ క్రెడిట్ స్కోర్‌ను కొన్ని పాయింట్లు తగ్గిస్తాయి. అందువల్ల కనిపించిన చోట లోన్ కోసం అప్లయ్ చేయకండి. నెలలో పదికన్నా ఎక్కువసార్లు మీరు లోన్ కావాలని అప్లయ్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. తద్వారా మీ పర్సనల్ లోన్ అర్హతపై దెబ్బపడుతుంది.