Solar Eclipse: మరికొన్ని గంటల్లో సూర్యగ్రహణం. ఎక్కడెక్కడ కనిపించనుందో తెలుసా?

సాధారణంగా ప్రతి సంవత్సరం సూర్య గ్రహణాలు, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. కొన్ని పాక్షికంగా ఏర్పడితే కొన్ని పూర్తిగా ఏర్పడతాయి. ఒక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ గ్రహణాలు కూడా ఏర్పడతాయి. ఈ ఏడాది 2022లో తొలి సూర్యగ్రహణం ఈ నెల ఏప్రిల్ 30న ఏర్పడనుంది. అయితే ఇది పాక్షిక సూర్యగ్రహణం.

ఈ ఖగోళ ఘటన ఈ నెల రెండో అమావాస్య రోజే ఏర్పడనుంది. దీన్ని బ్లాక్ మూన్(Black Moon) అని కూడా పిలుస్తారు. సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు, భూగ్రహం మీద ఆ నీడ పడినప్పుడు సూర్యగ్రహణాలు క‌నిపిస్తాయి. ఈ 2022లో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా అడ్డుకోవడంతో పాక్షిక గ్రహణం ఏర్పడుతుంది.

ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 30 శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమై మే 1న ఉదయం 04.07 గంటలకు ముగుస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ పాక్షిక సూర్యగ్రహణం భారత్ లో కనిపించదని తెలిపారు. ఆ సమయంలో భారత్‌లో కొద్దిగా చీకటిగా ఉంటుందని అన్నారు. ఈ పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ అమెరికా, అంటార్కిటికా, దక్షిణ మహాసముద్ర ప్రాంతాలకి పూర్తిగా కనిపిస్తుందని, ఆకాశం నిర్మలంగా ఉంటే చిలీ, ఉరుగ్వే, పశ్చిమ పర్వాగ్వే, అర్జెంటీనా, బొలీవియా, పెరూ, బ్రెజిల్‌ దేశాలలో కూడా సూర్యాస్తమయం సమయంలో గ్రహణం కనిపిస్తుందని నాసా పేర్కొంది.

Show comments