iDreamPost
android-app
ios-app

సినిమా వసూళ్ల కహాని – ఆశా నిరాశా

  • Published Aug 01, 2021 | 5:51 AM Updated Updated Aug 01, 2021 | 5:51 AM
సినిమా వసూళ్ల కహాని – ఆశా నిరాశా

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో థియేటర్లు తెరుచుకున్నాయి. పూర్తి స్థాయిలో అంటే ఇంకొంచెం టైం పట్టేలా ఉంది కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ రెండు రోజుల పరిస్థితిని అంచనా వేసే పనిలో సీరియస్ గా ఉన్నాయి. అవేంటో చూద్దాం. తెలుగు వరకు చూసుకుంటే వచ్చిన వాటిలో అంతో ఇంతో జనం దృష్టిని ఆకర్షించినవి తిమ్మరుసు, ఇష్క్ లు మాత్రమే. ఎక్కువ శాతం స్క్రీన్లు వీటినే ప్రదర్శించాయి. డిస్ట్రిబ్యూటర్ నెట్ వర్క్ బాగా సపోర్ట్ చేయడంతో హాళ్లు ఎక్కువ దొరికాయి. పబ్లిక్ సైతం ఈ రెండు ఆప్షన్లు మాత్రమే పెట్టుకోవడంతో మిగిలిన మూడు సినిమాలకు కనీస స్పందన కరువయ్యింది. మిగిలిన విషయాలు చూద్దాం

గ్రౌండ్ రియాలిటీని గమనిస్తే మరీ ఎక్కువగా ఆశించిన స్థాయిలో దేనికీ వసూళ్లు లేవు. ఉన్నంతలో తిమ్మరుసు బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుండగా ఇష్క్ కు వచ్చిన టాక్ ప్రతిబంధకంగా మారింది. అన్ని సినిమాలకు చాలా చోట్ల షోకు రెండు మూడు వేల కలెక్షన్ రావడమే గొప్పనేలా ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వీటి కోసం థియేటర్లకు వచ్చేందుకు సుముఖంగా లేరు. ఇప్పుడు కాకపోయినా ఇంకో నెలలో అయినా వీటిని ఓటిటిలో చూసే సౌలభ్యం ఉన్నప్పుడు బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ఉండే తీరాలని వాళ్ళేమి అనుకోవడం లేదు. ఆ ఫీలింగ్ ని దాటే స్థాయిలో సత్యదేవ్, తేజ సజ్జలకు ఇమేజ్ లేకపోవడం కీలకంగా పరిగణించాల్సిన అంశం.

తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ విజయవాడ లాంటి ముఖ్య నగరాల్లో ఆక్యుపెన్సీ లెవెల్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి కానీ పట్టణాలతో పాటు బిసి సెంటర్లలో మాత్రం రెస్పాన్స్ సోసోనే. ఒకవేళ నాని టక్ జగదీష్ వచ్చి ఉంటే ఖచ్చితంగా మంచి నెంబర్స్ నమోదయ్యేవి. రేపటి నుంచి వీక్ డేస్ లో అసలు పరీక్ష మొదలుకానుంది. కొత్త సినిమాలు వచ్చే దాకా నాలుగు రోజుల పాటు డీసెంట్ క్రౌడ్స్ ని ఆకర్షించడం తిమ్మరుసు, ఇష్క్ లకు పెద్ద సవాలే. 6వ తేదీ ఇంకో అయిదు సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో మరింత క్లారిటీ రావాలంటే ఇంకో పది రోజులు ఆగాలి. అప్పటికి నిబంధనల్లో కూడా మార్పు రావొచ్చు

Also Read: డిజిటల్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది