iDreamPost
android-app
ios-app

వీడియో షేర్ చేసిన స్నేహ.. అలా చేస్తే హార్ట్ అటాక్ వస్తుందంటున్న ఫ్యాన్స్!

  • Published Aug 10, 2023 | 7:26 PM Updated Updated Aug 10, 2023 | 7:26 PM
  • Published Aug 10, 2023 | 7:26 PMUpdated Aug 10, 2023 | 7:26 PM
వీడియో షేర్ చేసిన స్నేహ.. అలా చేస్తే హార్ట్ అటాక్ వస్తుందంటున్న ఫ్యాన్స్!

హీరోయిన్ స్నేహకు తెలుగులో చాలామంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఆమెను చందమామ నేలకు దిగివచ్చినట్లు ఉంటుందని పొగిడేస్తూ ఉంటారు. తెలుగులో స్నేహ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం ఇండస్ట్రీల్లో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ తనకు సూట్ అయ్యే పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఎప్పుడూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, తన ఫొటోలు షేర్ చేసే స్నేహ తాజాగా ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసి ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా చేయద్దంటూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు.

స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఫొటోషూట్స్, ఫ్యామిలీతో దిగిన ఫొటోలు, పండగలు, స్పెషల్ అకేషన్స్, ఫ్రెండ్స్ తో హ్యాంగౌట్ ఇలా అన్ని విషయాలను ఇన్ స్టా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ మంచి మంచి పిక్స్ పోస్ట్ చేసే స్నేహ తాజాగా ఒక వర్కౌట్ వీడియో పోస్ట్ చేసింది. జిమ్ లో తాను చెమటోడుస్తున్న వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో స్నేహ దాదాపు 35 కేజీల వరకు బరువును లిఫ్ట్ చేస్తూ కనిపించింది. ఇలా వెయిట్స్ లిఫ్ట్ చేసే హీరోయిన్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. అది కూడా నాలుగు పదుల వయసులో ఇంత కఠోరమైన ఎక్స్ ర్ సైజెస్ చేయడం చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sneha (@realactress_sneha)

అలాంటి వ్యాయామాలు చేయద్దు అంటూ స్నేహకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి బరువులు ఎత్తడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు, జిమ్ ఫ్రీక్స్ ఇలాంటి కఠోరమైన వ్యాయామాలు చేయడం వల్ల గుండెపోటుతో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే స్నేహ అభిమానులు ఆమె ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుతున్నారు. ఇలాంటి ఎక్సర్ సైజెస్ కి బదులుగా చక్కగా యోగా చేయండి అంటూ సూచిస్తున్నారు. అయితే సెలబ్రిటీలు ఎప్పుడూ నిపుణుల పర్యవేక్షణలోనే జిమ్ చేస్తుంటారు. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటిస్తూనే అలాంటి వ్యాయామం చేస్తూ ఉండచ్చు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. స్నేహ వర్కౌట్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sneha (@realactress_sneha)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio