iDreamPost
android-app
ios-app

Venkatesh & Rana : దృశ్యం 2 , విరాటపర్వం కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు

  • Published Nov 08, 2021 | 8:48 AM Updated Updated Nov 08, 2021 | 8:48 AM
  • Published Nov 08, 2021 | 8:48 AMUpdated Nov 08, 2021 | 8:48 AM
Venkatesh & Rana : దృశ్యం 2 , విరాటపర్వం కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు

ఎప్పుడో ఆరు నెలల తర్వాత వచ్చే సినిమాలు కూడా రిలీజ్ డేట్లు ప్రమోషన్లు అంతా పక్కా ప్లానింగ్ తో చేస్తుంటే ఫస్ట్ కాపీ చేతిలో ఉంచుకుని దృశ్యం 2, విరాట పర్వంల గురించి కనీస అప్ డేట్ లేకపోవడం దగ్గుబాటి అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది. ఒకవేళ ఓటిటికి ఇస్తే ఇచ్చారు అదైనా ధైర్యం ప్రకటించడని డిమాండ్ చేస్తున్నారు. నిర్మాత సురేష్ బాబు మాత్రం కారణాలు చెప్పకుండా మౌనం వహిస్తున్నారు. నారప్ప వచ్చి రెండు నెలలు దాటేసింది. అందరూ దాన్ని మర్చిపోయారు కూడా. ప్రైమ్ లో వచ్చినప్పుడు ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేసినా సినిమా చూశాక థియేటర్లలో రానందుకు వాళ్ళేమి ఫీల్ కాలేదు. ఇప్పుడు దృశ్యం 2 వంతు వచ్చింది.

ఎవరికి ఇచ్చారో తెలియదు. కనీసం క్లూ కూడా లేదు. ఇప్పటిదాకా రెండు మూడు వర్కింగ్ స్టిల్స్ తప్ప కనీసం పోస్టర్ కూడా ఇవ్వలేదు. దాదాపు ఫస్ట్ పార్ట్ లో నటించినవాళ్లంతా ఇందులోనూ ఉన్నారు. ఒరిజినల్ వెర్షన్ హ్యాండిల్ చేసిన జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. ఇంత పర్ఫెక్ట్ టీమ్ ఉన్నా ఎందుకు ఆలస్యం అవుతుందో అంతు చిక్కడం లేదు. ఇక విరాట పర్వంది మరో కథ. అదిగో పులి ఇదుగో తోక తరహాలో నానబెడుతూ వస్తున్నారు తప్ప కనీసం అయిపోయిందా లేదా అనే మాట కూడా చెప్పడం లేదు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉన్న రానా దీని గురించి నేరుగా మాట్లాడ్డం లేదు.

ఓ వెబ్ సైట్ లో సంగీత దర్శకుడు మారాడని గాసిప్ వేస్తే అది తప్పని చెప్పాడు కానీ ఇంతకీ తన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేదు. ఒకటి రెండు రోజుల చిన్న ప్యాచ్ వర్క్ తప్ప అంతా అయిపోయిందని అంటూనే ఉన్నారు కానీ అదే ఎంతకీ తెగడం లేదు. నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ నక్సలైట్ బ్యాక్ డ్రాప్ మూవీలో సాయి పల్లవి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఏది ఏమైనా ఈ రెండు సినిమాలు థియేటరా ఓటిటినా ఏదో ఒకటి తేల్చి చెప్పేస్తే ఫ్యాన్స్ కు టెన్షన్ ఉండదుగా. ఎక్కడో చూడాలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది

Also Read : Jr NTR : యంగ్ టైగర్ కు అనుకోని విరామం

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio