iDreamPost
iDreamPost
ESI కుంభకోణంలో అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేయడం బీసీల పై దాడి,బీసీ లను అణిచివేయ్యటానికే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసారంటూ చంద్రబాబు ఆరోపణలు చేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో “ఈ రోజుల్లో కూడా కులాలు ఉన్నాయా” అంటూ అమాయకత్వాన్ని ప్రదర్శించిన చంద్రబాబుకు ఈ రోజు కులాలు అది మూడు తరాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబానికి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ సందర్భంలో కులం గుర్తు రావటం ఆశ్చర్యం .
అంతే తప్ప గతంలో బాబు గారి హయాంలో బీసీ నేతలకు జరిగిన అన్యాయం గురించి , వారికి బాబు చేసిన అన్యాయాల గురించి మీరు ప్రశ్నించకూడదు . ప్రశ్నిస్తే మీరిప్పుడు బీసీ ద్రోహి కాగలరు .
2000/2001 సంవత్సరంలో చంద్రబాబు హయాంలో బయటపడిన నకిలీ స్టాంపుల స్కామ్ బహుశా చాలా మందికి గుర్తుండి ఉండకపోవచ్చు . ఆ రోజుల్లో రాష్ట్ర , జాతీయ మీడియా మొత్తం హర్షద్ మెహతా స్కామ్ కన్నా ఎక్కువగా ఈ స్కామ్ గురించి వార్తలు రాసాయి .ఆ కుంభకోణం మొత్తం విలువ సుమారు 20 వేల కోట్లు ఉంటుందని పత్రికలూ రాశాయి.. అప్పటి వరకు బయటపడ్డ కుంభకోణాలలో ఇదే పెద్ద మొత్తం. అన్నా హజారే వేసిన ఒక PIL వలన ఈ కుంభకోణం అనుకోకుండా బయటపడింది.
Also Read:చంద్రబాబుకు ప్రజాస్వామ్య మనుగడు ఇప్పుడు గుర్తుకొచ్చిందేటబ్బా..?
ఈ స్కామ్ సూత్రధారి కరీం లాలా తెల్గీ, అయితే నాటి టీడీపీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి కృష్ణయాదవ్ ఈ స్కామ్ లో ఒక నిందితుడు. కృష్ణ యాదవ్ 1994 & 1999 ఎన్నికల్లో హిమాయత్ నగర్ నుండి టీడీపీ తరుపున గెలిచారు. ఈ కేసులో మరో నిందితుడు శ్రీరామ్ భద్రయ్య (పెరిక ). ఆయన టీడీపీ తరుపున ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ నియోజక వర్గం నుండి 1999 ఎన్నికల్లో గెలిచారు.ఈ స్కామ్ లో చీరాల నుంచి టీడీపీ తరుపున 1994 & 1999 లో గెలిచిన పాలేటి రామారావ్(యాదవ) పాత్ర మీద కూడా ఆరోపణలు వొచ్చాయి కానీ కేసు నమోదు కాలేదు.
ఈ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కున్న ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు బీసీ నేతలు కావటం యాధృచ్చికమా?లేక కొన్ని పెద్ద తలకాయలను తప్పించి బీసీ నేతలను ఇరికించారా? అంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి.. ఇలా కేవలం బీసీ నేతలు మాత్రం బుక్ అయిన స్కామ్ నెవెర్ బిఫోర్ నెవెర్ ఆఫ్టర్..లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అంటారు!
ఈ స్కామ్ లో 2003లో కృష్ణ యాదవ్ అరెస్ట్ అవ్వగానే టీడీపీ నుంచి ఆయన్ను బహిష్కరించారు.. టీడీపీ తరుపున ఆయనకు న్యాయ సహాయం కూడా దక్కలేదు.
2004 అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణ యాదవ్ మరియు శ్రీరామ్ భద్రయ్యలకు పోటీ చేసే అవకాశం చంద్రబాబు ఇవ్వలేదు . చీరాలలో మాత్రం పాలేటి రామా రావ్ కు టికెట్ ఇచ్చారు.మహబూబాబాద్ నుండి టీడీపీ తరపున వేం నరేందర్ రెడ్డి పోటీ చేయగా , హిమాయత్ నగర్ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి కేటాయించారు .ఇది అన్యాయం , కేవలం ఆరోపణలు తప్ప నేర నిర్ధారణ జరగనప్పుడు మా బీసీ సీట్లు రెండూ మాకివ్వకుండా రెండు చోట్లా ఓసిలకి ఎలా ఇస్తారు అంటూ ఆయా నియోజక వర్గాల్లో బీసీలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేసినా బాబు పట్టించుకోలేదు.
Also Read:ఇద్దరు మాజీ మంత్రుల పై ఎస్సీ, ఎస్టీ కేసు
అప్పటి చంద్రబాబు ట్రెండ్ ను బట్టి కృష్ణ యాదవ్ కుటుంబానికి టీడీపీ టికెట్ ఇచ్చిఉండాలి.. ఆ తర్వాత ఈ బీసీ నేతలిరువురూ రాజకీయంగా కనుమరుగయ్యారు . 2012లో కృష్ణ యాదవ్ ను తిరిగి టీడీపీలో చేర్చుకున్నారు. కృష్ణ యాదవ్ అంబర్ పేట నుంచి పోటీ చేయలని ప్రయత్నం చేసినా టీడీపీ,బీజేపీ పొత్తులో భాగంగా కిషన్ రెడ్డి మరోసారి అక్కడ నుంచి పోటీచేశారు.
ఆ 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున బీసీ నేత కృష్ణయ్య ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించటం ఆయన కుల రాజకీయాలకు పరాకాష్ట.ఇది ఆంధ్ర రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకుని ఆకర్షించడం కోసమే తప్ప మరొకందుకు కాదు . ఎటూ తెలంగాణాలో గెలవలేమని ఈ ఎత్తుగడతో ఆంధ్రాలో బీసీ ఓట్లు కొల్లగొట్టవచ్చని వేసిన ఎత్తుగడ అని విమర్శకుల వాదన . నిజంగా చంద్రబాబు ఒక బీసీని ముఖ్యమంత్రి చేయదలుచుకొంటే ఆంధ్రాలో బీసీ నాయకుణ్ణి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి బాబు గారే తెలంగాణాలో పోటీ చేయొచ్చు కదా అన్న బీసీ నాయకుల ప్రశ్నలకు బాబు నుండి సమాధానం లేదు .
అప్పటి వరకూ టీడీపీలో బలంగా ఉన్న దేవేందర్ గౌడ్ , రమణ , శ్రీనివాస్ యాదవ్ లాంటి బీసీ నేతలను కాదని కృష్ణయ్యకే ఎందుకిచ్చారు . ఎలాగూ ఓడిపోయే దానికి కృష్ణయ్య అయితేనేం , రామయ్య అయితేనేం అనుకొన్నారా ? . సరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన బీసీ నేతకి అండగా నిలబడి గెలిపించే ప్రయత్నం చేశారా అంటే అదీ లేదు . పైగా అప్పటివరకూ ఎల్బీ నగర్ టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న ఎస్వీ కృష్ణ ప్రసాద్ అనుచరులు నామినేషన్ వేయటానికి పోయిన కృష్ణయ్య పై భౌతిక దాడి చేసి అవమానించారు . తరువాత విచిత్రంగా టీడీపీ ఇంచార్జ్ కృష్ణ ప్రసాద్ , టీడీపీతో పొత్తులో ఉన్న బిజెపి ఇంచార్జ్ కళ్ళం రవీందర్ రెడ్డి ఇరువురూ కాంగ్రెస్ అభ్యర్ధి సుధీర్ కి మద్దతు ఇచ్చినా బాబు కృష్ణ ప్రసాద్ ని వారించి టీడీపీ గెలుపుకి కృషి చేయమని కోరిందీ లేదు . అలాగే పొత్తులో ఉన్న బీజేపీ ద్వారా కళ్ళం రవీందర్ రెడ్డి మద్దత్తు కృష్ణయ్యకి ఇప్పించేట్టు కృషి చేసిందీ లేదు .
Also Read:తరువాత ఎవరు? తెలుగు తమ్ముళ్లలో టెన్షన్…
ఆ ఎన్నికల్లో కృష్ణయ్య గెలిచారు కానీ చంద్రబాబు ఆయన్ను కనీసం టీడీపీ శాసనసభ పక్ష నేతగా నియమించలేదు. అనుభవం లేదు కాబట్టి కృష్ణయ్య ను టీడీపీఎల్ పి నేతగా నియమించలేదని చంద్రబాబు చెప్పారు.. అది బీసీల మీద ప్రేమ .. TDLP కే అనుభవం లేదంటే మరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించారు? బీసీ ఓట్ల కోసం …
ఇదీ చంద్రబాబుకి బీసీలపై ఉన్న ప్రేమ . తన హయాంలో ఇందరు బీసీ నాయకులకు జరిగిన అన్యాయం గురించి నోరెత్తని బాబు . తన ప్రభుత్వ హయాంలో జరిగిన ESI కుంభకోణంలో బీసీ అని చేప్తే తప్ప ప్రజలకు తెలియని బీసీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగితే బీసీలకు అన్యాయం జరుగుతుందని మొసలి కన్నీరు కార్చడం టీడీపీని వదిలేసిన బీసీ వర్గాల సానుభూతి కోసం , ESI కుంభకోణం నుండి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం తప్ప మరొకందుకు కాదు .పులికి బాటసారి మీద, బాబుకి బీసీల మీద ప్రేమ…రెండు ఒకటే …