iDreamPost
android-app
ios-app

ఫేక్ నామినేషన్ డ్రామా – బయటికి వెళ్ళేది అతనే

  • Published Nov 15, 2020 | 10:07 AM Updated Updated Nov 15, 2020 | 10:07 AM
ఫేక్ నామినేషన్ డ్రామా – బయటికి వెళ్ళేది అతనే

దీపావళి పండగ సందర్భంగా కొత్త వీకెండ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే ఆసక్తి మధ్య నిన్న ఎపిసోడ్ సాగింది. పండగ కానుకగా నాగార్జున సూపర్ హిట్ పాటలకు సభ్యులు జంటలుగా మారి డాన్సులు చేయగా కొన్ని బాగా వచ్చాయి. మరికొన్ని ఏదో మమ అనిపించారు. నాగ్ మాత్రం జిగేల్ మనే డ్రెస్ తో షోకి ఆకర్షణగా నిలిచారు. సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ ఎలిమినేట్ అయినట్టుగా కాసేపు టెన్షన్ పెట్టించిన కింగ్ అతన్ని ఏకంగా ఏడిపించేశాడు. నిజంగానే వెళ్తున్నాడేమో అనుకుని హౌస్ మేట్స్ కూడా ఖంగు తిన్నారు. కానీ అదంతా ఉత్తుత్తినే తెలిశాక యదావిధిగా డ్రామా రియాక్షన్లు ఎప్పటిలాగే వచ్చాయి.

ఈ రసవత్తరమైన నాటకంలో ఎవరి పాత్రను వాళ్ళు ఓ రేంజ్ లో పండించారు. మోనాల్ త్యాగం చేసేందుకు సిద్ధపడగా గతంలో ఎందుకు రాలేదని నిలదీశాడు నాగ్. సోహైల్ అలా జరగదు అంటూ ఏకంగా ఆర్గుమెంట్ చేశాడు. అరియనా బిగ్ బాస్ ని దుమ్మెత్తిపోసింది. ఇక బయటికి వెళ్లే ముందు ఓ టాస్కు చేయాలనీ చెప్పిన నాగ్ మిగిలినవాళ్లలో ఇద్దరు ఫ్రెండ్స్ నలుగురు శత్రువులు ఎవరో చెప్పాలని సూచించాడు. సోహైల్, మోనాల్ లను స్నేహితులుగా ప్రకటించుకున్న అఖిల్ అభిజిత్, లాస్య, హారిక, మెహబూబ్ లను ఎనిమీస్ గా పేర్కొన్నాడు. దానికి కారణాలు కూడా చెబుతూ సుదీర్ఘంగా దీన్ని సాగదీశాడు.

స్క్రిప్ట్ ఎలా సాగదీయాలో అర్థం కాలేదు కాబోలు బిగ్ బాస్ రైటర్స్ అఖిల్ ఫేక్ నామినేషన్ మీద ఇంత సాగతీత ఎందుకు చేశారోవాళ్ళకే తెలియాలి. అంతా చేసి తూచ్ అనడం మాములు కామెడీ కాదు. ఇక అఖిల్ కు ఆఫర్ లో భాగంగా ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని కెప్టెన్ అయ్యే ఛాన్స్ కొట్టేశాడు. సో ఇంకో వారం సేఫ్. ఇక ఫైనల్ గా హారిక, మెహబూబ్, సోహైల్, అరియనా, మోనాల్ లు మిగిలి ఉన్నారు. లీకైన సమాచారాన్ని బట్టి ఈరోజు మెహబూబ్ ను సాగనంపబోతున్నారని తెలిసింది. కుమార్ సాయి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉందని ఇన్ సైడ్ టాక్. మొత్తానికి జీడిపాకంను మించి అఖిల్ ఎపిసోడ్ తో శనివారం ముగిసింది

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş