Idream media
Idream media
పుణె మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారంలో ఉన్న శివసేన.. ఆ సంస్థ ఉద్యోగులకు జీతాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను యాక్సిస్ బ్యాంక్ నుంచి వేరే జాతీయ బ్యాంక్‌కు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే యాక్సిస్‌లో సీనియర్ అధికారిణిగా ఉన్న మాజీ సీఎం ఫడ్నవిస్ సతీమణి అమృత.. శివసేన నిర్ణయంపై ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని ట్విటర్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు.
తాను దేవేంద్ర ఫడ్నవీస్‌ను పెళ్లి చేసుకోక ముందు నుంచే పుణె మున్సిపల్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు యాక్సిస్ బ్యాంక్‌లో కొనసాగుతున్నాయన్నారు. గతంలో కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అవి అలాగే ఉన్నాయని, ప్రైవేటు బ్యాంకులు కూడా భారత్‌కు చెందినవేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇలా చేయడం ద్వారా వారు నా భర్తను, నన్ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
‘ఒక చెడ్డ నాయకుడిని కలిగి ఉండటం మహారాష్ట్ర తప్పు కాదు. అయితే ఆ నాయకుడికి మద్దతు ఇవ్వడం తప్పు’ అంటూ అమృత ట్వీట్ చేశారు. జాగో మహారాష్ట్ర అని పిలుపునిచ్చారు. అమృత ట్విట్ పై శివసేన కార్యకర్తలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు.