iDreamPost
iDreamPost
విక్టరీ వెంకటేష్ వరుణ్ కాంబోలో రూపొందుతున్న ఎఫ్3 విడుదల తేదీ మరోసారి మారింది. ముందుకు ఫిక్స్ చేసుకున్న ఏప్రిల్ 28 కాకుండా ఏకంగా ఇంకో నెల వాయిదా వేసుకుని మే 27కి వెళ్లిపోయింది. దీని పట్ల వెంకీ అభిమానులు బాగా అసంతృప్తిగా ఉన్నట్టు సోషల్ మీడియా కామెంట్స్ ని బట్టి అర్థమవుతోంది. మరుసటి రోజే ఆచార్య ఉండటంతో దానితో నేరుగా పోటీ పడేందుకు ఇష్టపడని నిర్మాత దిల్ రాజు ఆ మధ్య ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే నిర్ణయం తీసుకున్నారు. పైగా కమల్ హాసన్ విక్రమ్ కూడా 29న వస్తుందనే వార్తల నేపథ్యంలో ఎంత బలమైన కంటెంట్ ఉన్నా ఈ రెండింటి మధ్య ఎఫ్3 రిస్క్ తీసుకోవడం కలెక్షన్స్ పరంగా కరెక్ట్ కాదు.
అందుకే ఒక నెల వెనక్కు వెళ్లడం సమర్ధనీయమే. అలా అని అది సోలో డేట్ కాదు. అడవి శేష్ మేజర్ కొద్దిరోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా వచ్చేందుకు ప్రకటన ఇచ్చింది. మరి ఇప్పుడు ఎఫ్3 కోసం ఏది వెనక్కు తగ్గుతుందో చెప్పలేం. మేజర్ పాన్ ఇండియా మూవీ. ప్రధాన భారతీయ భాషలు అన్నిట్లో ప్లాన్ చేశారు. సోనీతో పాటు మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. కాబట్టి పోస్ట్ పోన్ సాధ్యం కాకపోవచ్చు. రంగరంగ భారీ బడ్జెట్ కాదు కాబట్టి ఇంకో స్లాట్ ను అనుకూలంగా చూసుకుని రావడం వల్ల నష్టమేమి లేదు. కాబట్టి ఎఫ్3కి అసలు కాంపిటీషన్ లేదని చెప్పడానికి లేదు.
దానికి తోడు పిల్లల పరీక్షలు తదితర అంశాలు అన్నింటినీ ఎఫ్3 టీమ్ పరిగణనలోకి తీసుకుంది. ఇది వచ్చే టైంకి ఆర్ఆర్ఆర్, రాధే శ్యాం, కెజిఎఫ్ 2, ఆచార్య, వలిమై, సర్కారు వారి పాట లాంటి భారీ చిత్రాలన్నీ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఉంటాయి కాబట్టి ఇబ్బందేమీ లేదు. సో ఇప్పటికైతే అంతా అనుకూలంగానే కనిపిస్తోంది. అయినా దేనికీ గ్యారెంటీ ఇవ్వలేం. ఇప్పుడు ఎఫ్3 కానీ వేరే సినిమా కానీ చెప్పిన డేట్ కే వస్తాయనే నమ్మకాలు లేవు. వచ్చేదాకా వెయిట్ చేద్దాం నుంచి వచ్చాక చూసుకుందాం అనేదాకా ప్రేక్షకులు అన్నిటికి ప్రిపేర్ అయిపోయారు. సో వస్తాయనే ఆశలు పెట్టుకుని ఎదురు చూడటం తప్ప ఫ్యాన్స్ అయినా చేయగలిగింది ఏమి లేదు
Also Read : DJ Tillu : అదరగొడుతున్న చిన్న సినిమా కలెక్షన్లు