iDreamPost
android-app
ios-app

యువతితో భార్యకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన కేంద్ర మాజీమంత్రి..యువతి తాట తీసిన భార్య

  • Published Jun 03, 2022 | 11:07 AM Updated Updated Jun 03, 2022 | 1:12 PM
  • Published Jun 03, 2022 | 11:07 AMUpdated Jun 03, 2022 | 1:12 PM
యువతితో భార్యకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన కేంద్ర మాజీమంత్రి..యువతి తాట తీసిన భార్య

వివాహేతర సంబంధాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వివాహేతర సంబంధాలే.. వారి పాలిట శాపాలై మృత్యు ఒడికి చేరుస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ శారీరక సుఖం కోసం పక్కదారిపడుతున్నారు. ఫలితంగా.. తమ సంసార జీవితాన్ని సమస్యలపాలు చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాల కారణంగా ఉన్న పరువు, మర్యాదలను చేజేతులా పోగొట్టుకుంటున్నారు.

తాజాగా మాజీ కేంద్రమంత్రి ఒకరు.. ఓ యువతితో తన భార్యకు అడ్డంగా దొరికిపోయారు. తన వయసులో సగం వయసు కూడా లేని యువతితో ఓ హోటల్ రూమ్ లో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆయన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇంతకీ ఆ కేంద్రమాజీమంత్రి ఎవరో తెలుసా ? ఇంకెవరు భరత్ సింగ్ సోలంకి. రెండుసార్లు గుజరాత్ పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భరత్ సింగ్ సోలంకి హోటల్ లో యువతితో ఉన్న సమయంలో.. అక్కడికి ఆయన భార్య రేష్మా పటేల్ వచ్చారు.

అక్కడి పరిస్థితి చూసిన ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. భరత్ సింగ్ తో ఉన్న యువతి జుట్టుపట్టుకుని చితకబాదారు. రేష్మా పటేల్ ను ఆపేందుకు సోలంకి ప్రయత్నించినా ఆమె ఆగలేదు. నా భర్తతో ఉన్న నిన్ను వదిలిపెట్టను అని హెచ్చరించింది. ఇదంతా రేష్మా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ అవుతోంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetjolly girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş