iDreamPost
android-app
ios-app

ముగిసిన బిగ్ యుద్ధం – గ్రాండ్ ఫినాలేకు సిద్ధం

  • Published Dec 20, 2020 | 6:43 AM Updated Updated Dec 20, 2020 | 6:43 AM
ముగిసిన బిగ్ యుద్ధం – గ్రాండ్ ఫినాలేకు సిద్ధం

ఇవాళ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధమయ్యింది. షూటింగ్ నిన్నే చేసుంటారు కాబట్టి ఇక రాత్రి జరగబోయే హంగామా కోసం ఈ రియాలిటీ షో ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో విజేతగా అభిజిత్ పేరు మ్రోగిపోతోంది. ఇప్పటిదాకా వచ్చిన లీకులన్నీ నిజమయ్యాయి కాబట్టి ఇది కూడా జరిగే ఛాన్స్ ని కొట్టిపారేయలేం. ఇక ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్ ని తీసుకొచ్చి ఇప్పుడున్న హౌస్ మేట్స్ లో జోష్ నింపే కార్యక్రమం నిన్న కూడా కొనసాగింది. మొన్న మోనాల్, లాస్య, కరాటే కళ్యాణి, కుమార్ సాయి ఓ రేంజ్ లో హంగామా చేసి బాగా అల్లరి చేశారు. నిన్న దాన్నే కొనసాగించి మిగిలినవాళ్ళను తీసుకొచ్చారు.

ఇవాళ అందరూ ఎదురు చూస్తున్న గంగవ్వ ఎంట్రీ గ్రాండ్ గా జరిగింది. సభ్యులు ఆవిడ వచ్చినప్పుడు మాములు అల్లరి చేయలేదు. కథ ఇకపై వేరే ఉంటుందని సొహైల్ మంచి ఎలివేషన్ జోడించాడు. జోర్దార్ సుజాత కూడా బ్లాక్ కాస్ట్యూమ్ లో అదిరే లుక్ తో ఎంట్రీ ఇచ్చింది. గంగవ్వతో కలిసి వేసిన స్టెప్పులు కూడా మాములుగా లేవు. నోయెల్ కొత్త ర్యాప్ సాంగ్ తో అందరికీ హుషారుని పంచాడు. ఇక హౌస్ లో ఉన్నప్పుడు బాగా అల్లరి చేసిన అవినాష్ మరోసారి రచ్చకు కారణమయ్యాడు. కాకపోతే సరదాగానే. ఇతను కూడా అఖిల్ ని టార్గెట్ చేసి పులిహోర కాన్సెప్ట్ ని మళ్ళీ తెచ్చాడు. ఆ మాటని అందరూ కలిసి ఓ బ్రాండ్ చేసిపారేశారు.

ఇక ధృవ సినిమాలో నీతోనే నేస్తమై పాటకు మెహబూబ్, దివి చేసిన డాన్స్ అసలు హై లైట్ గా నిలిచింది. ఊహించని విధంగా దివి హాట్ డ్రెస్ తో గ్లామర్ షో వడ్డించడం బోనస్. సోహైల్ ఏకంగా తనను దీపికా పదుకునేతో పోల్చేశాడు. అర్ధరాత్రి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ని చూసి అరియానా ఎమోషనల్ అయిపోయింది. ఇక ఆ తర్వాత అతను మాములు కామెడీ కామెడీ చేయలేదు. ఇలా మాజీలతో తాజాలు చేసిన హడావిడి బాగా పేలింది. ఇవాళ 6 గంటలకు జరగబోయే గ్రాండ్ ఫినాలే నాలుగు గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వనుంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగ చైతన్య, సాయి పల్లవిలు కూడా రాబోతున్నారని సమాచారం.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş