iDreamPost
android-app
ios-app

వెంకయ్య దారిలోకి వచ్చినట్లేనా..!?

వెంకయ్య దారిలోకి వచ్చినట్లేనా..!?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం భోథనపై ఇప్పటి వరకు పరోక్షంగా వ్యతిరేకత వ్యక్తం చేసిన భారత ఉపరాష్ట్రపతి, తెలుగు వ్యక్తి ముప్పవరపు వెంకయ్య నాయుడు వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. నిన్న గురువారం రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభంలో మాట్లాడని వెంకయ్య మొదటి సారి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ భోదనకు మద్దతు పలికారు.

ప్రస్తుత కాలంలో పేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదవులు కావాలనుకుంటున్నారని వెంకయ్య పేర్కొన్నారు. ఫలితంగా ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి వస్తోందన్నారు. ఏపీలో ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పపట్టడానికి వీల్లేదన్నారు. ఇంగ్లీష్‌ మీడియం కావాలని, అదే సమయంలో తెలుగును తీసేయకూడదనే తాను చెబుతున్నానంటూ వ్యాఖ్యానించారు.

నిన్న మొన్నటి వరకు అవకాశం వచ్చిన ప్రతిచోట తెలుగు భాషను కాపాడుకోవాలి అంటూ తనదైన శైలిలో మాట్లాడారు. ఆయన ప్రసంగాలు వింటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని వెంకయ్య నాయుడు వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రాజ్యసభలోనూ ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ఒక రోజు రాజ్యసభలో తన కార్యకలాపాలను తెలుగులో  నిర్వహించాలనుకుంటున్నానంటూ తెలుగుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మాతృభాషలోనే భోధన జరగాలన్నారు. 

అయితే వెంకయ్య నాయుడిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపధ్యంలో తాజాగా రాజమహేంద్రవరంలో ఇంగ్లీష్‌ మీడియానికి మద్దతుగా ఆయన మాట్లాడడంతో ప్రభుత్వ నిర్ణయానికి ప్రత్యక్షంగా మద్దతు పలికినట్లైంది.