iDreamPost
android-app
ios-app

ఆమె నన్ను అసభ్యంగా తాకింది.. చాలా బాధపడ్డాను: దుల్కర్ సల్మాన్

ఆమె నన్ను అసభ్యంగా తాకింది.. చాలా బాధపడ్డాను: దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో  నటించి..తనకంటు ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. సీతారామం సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ సినిమాలో దుల్కర్ నటనకు ఆడియన్స్ బహ్మరథం పట్టారు. ప్రస్తుతం బాలీవుడ్  పాటు మలయాళం సినిమాలతో దుల్కర్ సల్మాన్ బిజీగా  ఉన్నారు. ప్రస్తుతం “కింగ్ ఆఫ్ కోథా”, ‘గన్స్ అండ్ గులాబ్స్’ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లతో సల్మాన్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా తన వ్యక్తిగత, వర్క్ లైఫ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యువతి తనను అభ్యంతకరంగా తాకిందని.. ఆ సమయంలో తాను ఎంతో ఇబ్బంది పడ్డాని తెలిపారు.

దుల్కర్ సల్మాన్ నటిస్తున్న “కింగ్ ఆఫ్ కోథా”  సినిమాను అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది.  ఈ సినిమా ఆగష్టు 24న పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. విడుదలకు తక్కువ సమయం ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతుంది. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన అనేక విషయాలను హీరో దుల్కర్ సల్మాన్ మీడియాతో షేర్ చేసుకున్నారు. అలానే తన  వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను వెల్లడించాడు.

ఆయన మాట్లాడుతూ..” ఓకే  కన్మని, సీతారామం తరువాతే నాకు కేరళలో  లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. మాములుగా నాకు యువకుల్లో ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. నేను వాళ్లతో ఎప్పుడూ టచ్ లో ఉంటాను. ఇలా అభిమానులతో టచ్ లో ఉన్న సందర్భంలో  ఇబ్బందిపడిన ఘటనలు కూడా ఉన్నాయి. కొంతమంది మహిళలు ఫోటో తీసుకుంటానంటూ బుగ్గపై కిస్ చేయాలని చూస్తుంటారు. వాళ్ల ప్రవర్తనతో నేను ఆశ్చర్యపోయాను. గతంలో ఓ మహిళ నన్ను అసభ్యంగా తాకింది. ఆమె.. తన చేతులతో నా కాళ్లపై రుద్దింది. ఆమె అలా ఎందుకు చేసిందే అర్ధం కాలేదు.

అక్కడే వేదికపై చాలా మంది ఉన్నారు. ఆమె వలన నేను చాలా ఇబ్బంది పడ్డాను. నాకు ఎంతో బాధనిపించింది” అని దుల్కర్ తెలిపారు. కొందరు తమ చేతులను ఎక్కడ  ఉంచుకోవాలో తెలియనప్పుడు ఇలా జరుగుతుందని దుల్కర్ అన్నారు. దుల్కర్ సల్మాన్ నటించిన గన్స్ అండ్ గులాబ్స్ ఆగష్టు 18న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.  అలానే  ఆయన నటించిన  మరో సినిమా ‘కింగ్ ఆఫ్ కోథా’ ఆగష్టు 24న థియేటర్ల ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. దుల్కర్ సల్మాన్ జరిగిన చేదు అనుభవంపై మీ కామెంట్స్ తెలియజేయండి.

ఇదీ చదవండి: టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ కన్నుమూత.. నిర్మాత ఎమోషనల్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom