iDreamPost

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన మెట్రో..గాలి ఆడాక ఉక్కిరి బిక్కరి అయిన ప్రయాణికులు

  • Published Jun 06, 2024 | 9:13 AMUpdated Jun 06, 2024 | 9:13 AM

నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన నుంచి ప్రతిఒక్కరికి ప్రయాణం చాలా సులభంతరం అయిపోయిందనే విషయం తెలిసిందే. కానీ, ఈ మెట్రో సదుపాయాల్లో గత కొన్ని రోజులుగా తరుచు ఏదో ఒక సంకేతిక లోపం తలెత్తుంది. ఈ క్రమంలోనే తాజాగా నగరంలో నిన్న మరొసారి మెట్రో రైలు సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన నుంచి ప్రతిఒక్కరికి ప్రయాణం చాలా సులభంతరం అయిపోయిందనే విషయం తెలిసిందే. కానీ, ఈ మెట్రో సదుపాయాల్లో గత కొన్ని రోజులుగా తరుచు ఏదో ఒక సంకేతిక లోపం తలెత్తుంది. ఈ క్రమంలోనే తాజాగా నగరంలో నిన్న మరొసారి మెట్రో రైలు సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

  • Published Jun 06, 2024 | 9:13 AMUpdated Jun 06, 2024 | 9:13 AM
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన మెట్రో..గాలి ఆడాక ఉక్కిరి బిక్కరి అయిన ప్రయాణికులు

హైదరాబాద్ మహానగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన నుంచి ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. ఎదుకంటే.. ఈ మెట్రో సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన నుంచి ప్రతిఒక్కరికి ప్రయాణం చాలా సులభంతరమైంది. పైగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా.. చాలా వేగంగా, సురక్షితంగా తమ గమ్యస్థానలకు చేరుకుంటున్నారు. ఇక ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా గంటలు సమయం పట్టేది. కానీ, ఇప్పుడు నిమిషాల వ్యవధిలో ఎంత దూరమైన ప్రయాణించడానికి సులువగా ఈ మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రయాణీకులకు చాలా ఈజీ మార్గం అయిన ఈ మెట్రో సదుపాయాల్లో గత కొన్ని రోజులుగా తరుచు ఏదో ఒక సంకేతిక లోపం తలెత్తుంది. ఈ క్రమంలోనే తాజాగా నగరంలో నిన్న మరొసారి మెట్రో రైలు సాంకేతిక సమస్య తలెత్తడంతో డోర్లు ఓపెన్ కాకపోవడంతో.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన నుంచి ప్రతిఒక్కరికి ప్రయాణం చాలా సులభంతరం అయిపోయిందనే విషయం తెలిసిందే. అసలు నగరంలో ఎక్కడికైనా వేగంగా, సురక్షితంగా వెళ్లాలంటే అందుకు మెట్రో సేవలు బెస్ట్ అని చెప్పవచ్చు. కానీ, అలాంటి మెట్రో సేవల్లో తరుచు ఈ మధ్య ఏదో ఒక సంకేతిక లోపం  తలెత్తున్నాయి. ముఖ్యంగా  మెట్రో రైలు రాకపోకాలు కూడా చాలా నెమ్మదిగా సాగుతున్నాయి.ఇకపోతే నగరంలో నిన్న భారీ వర్షం కురవడంతో.. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా పెరిగింది. దీంతో చాలావరకు అందరూ మెట్రో సేవలను ఉపాయోగించుకున్నారు. అయితే తాజాగా నిన్న మెట్రోలో మరొసారి సాంకేతిక సమస్యలు తలెత్తి మెట్రో రైలు నిలిచిపోయాయి. ముఖ్యంగా మెట్రో ఎర్రమంజిల్ దగ్గరకు రగానే సాంకేతిక తలెత్తడంతో.. రైలును నడపకుండా ప్రయాణికులు నిలిపివేశారు. ఇక ట్రైన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఎందుకంటే.. ట్రైన్ డోర్లు ఓపెన్ కాకపోవడంతో ట్రైన్ లోపల గాలి ఆడక ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. దీంతో ట్రైన్ పైలెట్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులను బయటకు పంపించారు.

ఇలా ఒక్కసారికిగా ట్రైన్ లోని ప్రయాణికులంతా బయటకు రావడంతో స్టేషన్ కిక్కిరిసింది. అంతేకాకుండా ప్రయాణికులతో రద్దీగా మారింది. దీంతో మెట్రో సెక్యూరిటీ సిబ్బంది తక్కువ మంది ఉండటంతో మెట్రో స్టేషన్ లోని అధికారులు సైతం ప్రయాణికులను పట్టాలపైకి రానివ్వకుండా జాగ్రత్తాగా కిందకు పంపించారు. ఇక మెట్రో సాంకేతికతను రిపేర్ చేస్తున్నమని అధికారులు తెలిపారు. అలాగే వెనక వచ్చే ట్రైన్స్ కు అంతరాయం కలగకుండా చేస్తున్నామని వెల్లడించారు. మరి మెట్రో రైలులో ఏర్పడిన సాంకేతిక సమస్యతో ప్రయాణికులు ఇబ్బంది పడే ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి