టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో డ్రగ్స్ పట్టుబడ్డ రాడిసన్ బ్లూ హోటల్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేయగా ఇప్పుడు మరో కీలక విషయం తెరమీదకు వచ్చింది. ఈ రైడింగ్ జరిగిన సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉండడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ వ్యవహారంలో మేల్కొన్న పోలీసులు ఈ డ్రగ్స్ మీద దృష్టి పెట్టారు. ఇక డ్రగ్స్ తీసుకొంటున్నారని పోలీసులు వారు పని చేస్తున్న సంస్థలకు ఇచ్చిన సమాచారం మేరకు 13 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను తొలగించారని అంటున్నారు. ఇక మరో 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా సాఫ్ట్‌వేర్ సంస్థలు నోటీసులు ఇచ్చాయి.
డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన పెడ్లర్లు ప్రేమ్ కుమార్, టోని, లక్ష్మీపతి వద్ద నుంచి డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేయగా వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కొంతమంది టెక్కీలను అరెస్టు చేశారని తెలుస్తోంది. పెడ్లర్ల వద్ద కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారని, వారి వద్ద ఉన్న ఈ సమాచారాన్ని నిజమే అని ఖరారు చేసుకున్న తర్వాత పోలీసులు టెక్కీలు పనిచేస్తున్న కంపెనీలకు సమాచారం పంపారు.
అందుతున్న సమాచారం ప్రఖ్యాత అమెజాన్, ఇన్పోసిస్, మైక్రోసాఫ్ట్, మహేంద్ర, క్యూ వంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ డ్రగ్స్ మత్తులో దిగారని, ఆ కంపెనీల ఉద్యోగులను ఇప్పుడు తొలగించారని అంటున్నారు. కొందరు ఉద్యోగులు తాము తీసుకోవడమే కాక సరఫరా కూడా చేస్తున్నారని గుర్తించారు. దీంతో ఆరు మాసాలుగా అరెస్ట్ అయిన టెక్కీలు ఏఏ పబ్ లకు వెళ్లారు? అక్కడ ఎవరెవరిని కలిశారు? అనే విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.