iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌: డ్రగ్‌ పెడ్లర్‌ మస్తాన్‌ సాయి అరెస్ట్‌! లావణ్య-రాజ్‌తరుణ్‌ ఇష్యూలో..

  • Published Aug 12, 2024 | 5:02 PM Updated Updated Aug 12, 2024 | 5:18 PM

Drugs Case, Mastan Sai, APC Police: రాజ్‌తరుణ్‌-లావణ్య వివాదంలో ప్రధానంగా వినిపించిన పేరు మస్తాన్‌ సాయి. అతన్ని ఏపీ పోలీసులు వరలక్ష్మీ టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసులో తాజాగా అరెస్ట్‌ చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

Drugs Case, Mastan Sai, APC Police: రాజ్‌తరుణ్‌-లావణ్య వివాదంలో ప్రధానంగా వినిపించిన పేరు మస్తాన్‌ సాయి. అతన్ని ఏపీ పోలీసులు వరలక్ష్మీ టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసులో తాజాగా అరెస్ట్‌ చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Aug 12, 2024 | 5:02 PMUpdated Aug 12, 2024 | 5:18 PM
బ్రేకింగ్‌: డ్రగ్‌ పెడ్లర్‌ మస్తాన్‌ సాయి అరెస్ట్‌! లావణ్య-రాజ్‌తరుణ్‌ ఇష్యూలో..

ఇటీవలె హీరో రాజ్‌తరుణ్‌-లావణ్యల మధ్య జరుగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ వివాదంలో మస్తాన్‌ సాయి అనే పేరు బాగా వినిపించింది. తాజాగా ఆ మస్తాన్‌ సాయిని ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లాలో అన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వరలక్ష్మీ టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఉన్న అతన్ని అరెస్ట్‌ చేశారు. అలాగే పలువురు అమ్మాయిను కూడా అతను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏపీ తెలంగాణలోని అమ్మాయిలే టార్గెట్‌గా పలు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతని ఫోన్లో పలువురు అమ్మాయిల వీడియోలు కూడా దొరికినట్లు సమాచారం.

అయితే.. రాజ్‌తరుణ్‌-లావణ్య వివాదంలో మస్తాన్‌ సాయి పేరు మారుమోగిపోయింది. లావణ్య-మస్తాన్‌ సాయి సహజీవనం చేశారని రాజ్‌తరుణ్‌ కూడా ఆరోపించాడు. వారిద్దరి మధ్య ఫోన్‌ కాల్స్‌ రికార్డింగ్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. గతంలో మస్తాన్‌ సాయిపై అత్యాచారం కేసు కూడా పెట్టింది లావణ్య. ఇలా మస్తాన్‌ సాయి అనే పేరు బాగా హైలెట్‌ అయింది కానీ, ఆ వ్యక్తి మాత్రం ఎక్కడా బయటికి రాలేదు. ఈ వివాదం సంగతి పక్కనపెడితే.. అతను ఎందుకు అరెస్ట్‌ అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం..

గతేడాది సెప్టెంబర్‌లో వరలక్ష్మి టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వరలక్ష్మి టిఫిన్స్‌ ఓనర్‌ ప్రభాకర్‌ రెడ్డి.. మరో మహిళతో కలిసి డ్రగ్స్‌ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. లింగంపల్లి అనురాధ అనే మహిళ గోవా నుంచి డ్రగ్స్‌ను తీసుకొచ్చి.. ప్రభాకర్‌ రెడ్డికి ఇస్తే.. అతను వెంకటశివసాయికి అమ్మేవాడు. అలా వీళ్లంతా డ్రగ్స్‌ క్రయవిక్రయాలు చేసేవారు. ఒక ఏడాది పాటు వీరి డ్రగ్స్‌ దందా గుట్టుచప్పుడు కాకుండా బాగానే సాగింది. కానీ, అనురాధ గోవా నుంచి డ్రగ్స్‌ తెస్తున్న విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు పక్కా స్కెచ్‌ ప్రకారం అనురాధను డ్రగ్స్‌ తీసుకొస్తుండగా అరెస్ట్‌ చేశారు. ఆమె అరెస్ట్‌తో మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. ఈ కేసులో మస్తాన్‌ సాయి కూడా నిందితుడిగా ఉన్నాడు. దాంతో పాటు పలువురు అమ్మాయిలను ట్రాప్‌ చేసి, వారి వీడియోలను రికార్డ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోనే ఇప్పుడు మస్తాన్‌ సాయిని గుంటూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరి అతని అరెస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.