iDreamPost
android-app
ios-app

జంతువులకూ కరోనా.. వణికిపోతున్న ప్రపంచం..

జంతువులకూ కరోనా.. వణికిపోతున్న ప్రపంచం..

గతేడాది చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. కరోనా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించిందని చెప్తున్నా అది ఎన్నో మార్గాల్లో వ్యాపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పెంపుడు జంతువులకూ ఈ వైరస్ సోకే అవకాశం ఉండడంతో ఇప్పుడు అందరిలోనూ మరింత ఆందోళన పెరుగుతోంది. చైనాలోని హాంకాంగ్‌లో కొద్దిరోజుల క్రితం ఓవ్యక్తికి కరోనా సోకింది. అతన్ని ఐసోలేషన్ వార్డుకి తరలించి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఐతే అతని కుక్క క్రమక్రమంగా నీరసం అవుతున్నట్లు కనిపించడంతో యజమాని లేక ఒంటరితనంతో అలా ఫీలవుతుందని అంతా అనుకున్నారు.. కానీ అనుమానం వచ్చి డాక్టర్లు టెస్ట్ చేయగా దానికి కరోనా వైరస్ సోకిందనే అనుమానాన్ని వైద్యులు వెల్లడించారు.

కానీ కచ్చితంగా ధృవీకరించలేదు. ఆ కుక్కను పరిశీలించిన వైద్యులు లోలెవల్ కరోనా వ్యాపించిందన్నారు. వైరస్ కుక్క శరీరంపై ఉందా, లోపల ఉందా అన్నది పూర్తి టెస్టులు చేశాక చెప్తామన్నారు. శరీరంపై వైరస్ ఉంటే ఆ కుక్క యజమాని దానిని ముట్టుకోవడంతో వ్యాపించిన వైరస్ అని, దానివల్ల ఏ సమస్యా రాదని, అదే కుక్క శరీరంలో వైరస్ ఉంటే అది అత్యంత ప్రమాదకర సంకేతమంటున్నారు. ఆ కుక్కకు ఇంకా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయకముందే వాటి రిపోర్టులు రాకముందే మరో కుక్క లో లో వైరస్ కరోనా రావడం ఇప్పుడు వైద్యులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

అసలు కరోనా దేనినుంచి విజృంభించిందనేది చూస్తే కరోనా వైరస్ చైనాలో గబ్బిలాలకు ఎప్పటినుంచో ఉన్నా ఆవైరస్‌ని తట్టుకునే శక్తి గబ్బిలాలకు వాటికి ఉండటంతో వాటిపై కరోనా ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే 2019 డిసెంబర్‌లో కరోనా గబ్బిలాల నుండి పాములకు వ్యాపించింది. ఆ పాముల్ని చైనాలోని వుహాన్ నగరంలో గల హుబేయ్ మార్కెట్‌లో విక్రయించారు. అలా విక్రయించిన పాముల్ని అక్కడి ప్రజలు కొనుక్కుని ఫ్రై చేసుకుని తినేసారు. అలా పాముల ద్వారా కరోనా ప్రజలకు సోకిందని చెప్తున్నారు. (ఇది ప్రాధమిక నిర్ధారణ మాత్రమే.. కచ్చితంగా రుజువు కాలేదు..) మరి గబ్బిలాలనుంచి పాములకు, పాముల నుంచి మనుషులకు వచ్చిన కరోనా మనుషుల నుండి కుక్కలకు పాకుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి.

పెంపుడు జంతువుల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు భావిస్తే వాటిన్నింటిని ప్రత్యేకంగా నిర్బంధంలో ఉంచాలని హాంగ్ కాంగ్ ప్రభుత్వం పేర్కొంది. ఎందుకంటే కుక్కలతో ఎక్కువగా కుక్కల తర్వాత మనుషులే ఉంటారు.. కుక్కలకు వైరస్ సోకినట్టు వాటికి ఆ విషయం తెలియదు కాబట్టి దాని నుండి మరో కుక్కకు అలా ఊరంతా అత్యంత వేగంగా సోకుతుంది. అలాగే జరిగితే నిజంగా మానవ మనుగడకే డేంజర్ బెల్ప్ మోగినట్టు. ప్రస్తుతం ఈ అనుమానంతోనే జపాన్ డాక్టర్లు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి 10 వేల మందికి పైగా మృత్యువాత పడగా, 2.50 లక్షల మందికి పైగా వైరస్ సోకినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

Jojobet GirişBetcioivermectin tabletpokerklaspokerklaspokerklasmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş