Idream media
Idream media
సంక్షేమం, అభివృద్ధిలను జోడు చక్రాలుగా చేసుకుని సీఎం వైఎస్ జగన్ పరిపాలనా బండిని నడిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పయనింపజేస్తున్నారు. హడావుడి లేకుండా, ప్రచార ఆర్భాటానికి దూరంగా సీఎం వైఎస్ జగన్ తన పని తాను చేసుకుపోతున్నారు. పరిశ్రమలు పెట్టేవారికి అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేస్తూ, రాయతీలు కల్పిస్తూ రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తున్నారు.
తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, సీఈవోలు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో కలసి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఈ రోజు క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు.
వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్ఛరింగ్ క్లస్టర్‌లో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ సునిల్ వాచని, సీఈవో పంకజ్ శర్మలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. డిక్సన్ టెక్నాలజీ కొప్పర్తి యూనిట్‌లో మొబైల్స్, వేరియబుల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, రక్షణ పరికరాలు, కెమెరాలు తయారు చేయనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా దాదాపు మూడు వేల మందికి ఉపాధి, ఉద్యోగఅవకాశాలు లభించబోతున్నాయి.
Also Read: విశాఖ ఉక్కు… అమ్మేస్తామంతే!!
డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే తిరుపతి క్లస్టర్‌లో తయారీ యూనిట్‌ను నిర్వహిస్తోంది. కొప్పర్తిలో ఏర్పాటు చేయబోది రెండో యూనిట్. తిరుపతి యూనిట్‌ను విస్తరిస్తామని డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. బోష్ కంపెనీతో కలసి వాషింగ్ మిషన్ల తయారీ యూనిట్‌ను తిరుపతిలో ప్రారంభిస్తామిన చెప్పారు. ఫలితంగా మరో వెయి మందికి ఉపాధి లభించనుంది.
ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి అన్ని అనుమతులు వేగంగా ఇస్తూ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం వైఎస్ జగన్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ సునిల్‌కు భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఏపీలో నూతన ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం అమలు చేస్తోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతోపాటు, రాయతీలు సకాలంలో అందించే ఉద్దేశంతో 2020–23 ఏడాదులకు ఇండస్ట్రియల్ పాలసీని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది.