iDreamPost
android-app
ios-app

ఆ బుల్లెట్‌ దాచుకోవాలని ఉంది.

ఆ బుల్లెట్‌ దాచుకోవాలని ఉంది.

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు దిశకు న్యాయం జరిగిందని,ఆమె ఆత్మకు శాంతి కలిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ పై దిశ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. దిశ‌ని కాల్చిన చోటే నిందితులని ఎన్‌కౌంట‌ర్ చేయ‌డంతో తమ బిడ్డకు తగిన న్యాయం జరిగిందని, నిందితులకు తగిన శిక్ష పడిందని మీడియాకి తెలిపారు.తన కూతురు తిరిగి రాదని ఈ ఎన్‌కౌంట‌ర్ ఒక ఉపశమనం మాత్రమే అని దిశా తండ్రి పేర్కొన్నారు.

ఆ బుల్లెట్‌ దాచుకోవాలని ఉంది.. తుపాకీలకు దండం పెట్టుకోవాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది.. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈ రోజు నీ ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మా’ అంటూ ట్విట్టర్ లో ఆనందం వ్యక్తం చేసాడు.

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ సుందర్ హర్షం వ్యక్తం చేశారు. ఎవరైనా తన కుమార్తెల జోలికొస్తే అలాగే చంపేందుకు సిద్ధపడేదానినని నటి ఖుష్బూ పేర్కొన్నారు. దీనిపై ఇవాళ ఉదయం ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ కుష్బూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

దిశకు తగిన న్యాయం జరిగిందని నిర్భయ తల్లి సంతోషం వ్యక్తం చేసారు. దిశకు 8 రోజుల్లోనే న్యాయం జరిగింది కానీ నిర్భయకు ఏడేళ్లయినా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నామని నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేసారు.

మా సినిమాలు ట్రైలర్లు చూడకపోయినా, లైక్ చేయకపోయినా పర్లేదు కానీ దిశా ఎన్‌కౌంట‌ర్ గురించి చాటింపు వేయండని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ లో తెలిపారు.

ఉత్తర్ ప్రదేశ్ లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని బీఎస్పీ అధినేత మాయావతి పేర్కొన్నారు. యూపీ ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ పోలీసుల నుండి ప్రేరణ పొందాలని మాయావతి సూచించారు.

దిశకు తగిన న్యాయం జరిగిందని సినీ నటుడు ఎన్టీఆర్ పేర్కొన్నారు.

పలువురు రాజకీయ నాయకులు,సినీనటులతో పాటు సామాన్యులు కూడా ఈ ఎన్‌కౌంట‌ర్ ఘటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సాహూ సజ్జనార్ సాహూ పోలీస్ అంటూ హైదరాబాద్ పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.