iDreamPost
android-app
ios-app

99.9%తో అసంతృప్తి, స్కోర్‌ను పెంచుకోవ‌డానికి పరీక్షను మళ్లీ రాస్తున్న‌ JEE మెయిన్ టాపర్

99.9%తో అసంతృప్తి,  స్కోర్‌ను పెంచుకోవ‌డానికి పరీక్షను మళ్లీ రాస్తున్న‌ JEE మెయిన్ టాపర్

ముంబైకి చెందిన చిన్మయ్ మూర్జని, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2022 ఫ‌స్ట్ సెషన్‌లో 99.956% స్కోర్ సాధించాడు. ఇప్పుడ‌త‌ను టాప‌ర్లలో ఒక‌డు. కాని అత‌నిలో ఒక అసంతృప్తి. అనుకున్న‌ట్లు, నూటికి నూరుశాతం మార్కుల‌ను సాధించ‌లేక‌పోయాడంట‌. అందుకే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను మళ్లీ రాయాలనుకుంటున్నాడు.

ఈ 17 ఏళ్ల చిన్మ‌య్, జూలై 21న ప్రారంభమయ్యే ఇంజనీరింగ్ అడ్మిషన్ టెస్ట్ రెండవ సెషన్‌లో పోటీ పడాలనుకుంటున్నాడు. అత‌ను నూటికి నూరుశాతం మార్కుల‌ను సాధిస్తాడా?

99.9% మార్కులు వ‌చ్చాయి, నువ్వుకూడా టాప‌ర్ వి. అయినా మ‌ళ్లీ ఎందుకు ఎంట్రెన్స్ రాద్దామ‌నుకొంటున్నావ‌ని మీడియా అడిగితే, నేను JEE మెయిన్స్ సెకండ్ సెషన్ ఎగ్జామ్ కూడా రాస్తా, నా స్కోరు పెంచుకొంటాన‌ని అంటున్నాడు.

2020లో, టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ రాసిన మ‌రుస‌టి రోజునుంచే JEE ప్రిప‌రేష‌న్ మొద‌లుపెట్టాడు. అత‌నికి ఇంజ‌నీరింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు JEE అడ్వాన్స్‌డ్‌లో టాప‌ర్ గా, దేశంలోని అత్యుత్త‌మ IITలలో ఒకదానిలో చేరాల‌నుకొంటున్నాడు.

ఇంత స్కోర్ ఎలా సాధించావ‌ని అడిగితే, ఎగ్జామ్ కు రెడీ అవుతున్న‌ప్పుడే టైంకి స్టడీ మెటీరియల్‌ని చ‌దివేశాడు. పాత ఎగ్జామ్ పేప‌ర్ల‌ను త‌ప్పులేకుండా రాశాడు. వారానికి రెండు మూడు మాక్ ఎగ్జామ్స్ రాశాడు. ఇంకా కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లో, డౌట్లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా టీచ‌ర్ల‌తో మాట్లాడేవాడు.

అత‌ని త‌ల్లి హౌస్ వైఫ్. తండ్రి ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నారు. చిన్మయ్ చెల్లెలు 8వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. అతను 10వ బోర్డ్ ఎగ్జామ్ లో 98% స్కోర్ చేశాడు. ఇప్పుడు 12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు.

చిన్మ‌య్ మాత్ర‌మేకాదు, JEE మెయిన్ సెషన్ 1లో నూటికి నూరు మార్కులు సాధించిన నవ్య హిసారియా కూడా ఎగ్జామ్ ను ‘రీటేక్’ చేయాలనుకొంటున్నాడు. కార‌ణం ప్రాక్టీస్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి