iDreamPost
android-app
ios-app

బర్త్ డే పార్టీలో నా ఫ్రెండ్ నిజంగానే చనిపోయాడు: ది బర్త్ డే బాయ్ డైరెక్టర్

The BirthDay Boy Story Is Director Whiskey Real Life Story: ది బర్త్ డై బాయ్ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ జులై 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ డైరెక్టర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.

The BirthDay Boy Story Is Director Whiskey Real Life Story: ది బర్త్ డై బాయ్ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ జులై 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ డైరెక్టర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.

బర్త్ డే పార్టీలో నా ఫ్రెండ్ నిజంగానే చనిపోయాడు: ది బర్త్ డే బాయ్ డైరెక్టర్

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ది బర్త్ డే బాయ్’ సినిమా గురించి బాగానే చర్చ జరుగుతోంది. వారి వినూత్నమైన ప్రమోషన్స్ తో సినిమా గురించి బాగా మాట్లాడుకునేలా చేస్తున్నారు. అంతేకాకుండా.. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసింది అని చెప్పడం మరింత బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ విస్కీ మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అసలు ఈ కథకి మూలం తన లైఫ్ లో జరిగిన సంఘటనలే అని చెప్పుకొచ్చాడు. తన జీవితంలో జరిగిన సంఘటనలు.. తన మిత్రుడు చనిపోయిన విషయం మీద ఈ కథ తీసినట్లు చెప్పాడు. ఇందులో 80 శాతం కథ రియల్ స్టోరీ అనే విషయాన్ని డైరెక్టర్ విస్కీ వెల్లడించాడు.

డైరెక్టర్ విస్కీ మాట్లాడుతూ.. “2016లో నా లైఫ్ లో జరిగినదే ఈ ఘటన. దాని మీద 2020లో సినిమా చేయాలి అనుకున్నాను. ఈ నాలుగేళ్ల సమయంలో అమెరికాలో ఉండి.. ఉద్యోగం చేస్తూ డబ్బులు సేవ్ చేసుకున్నాను. ఆ డబ్బు తీసుకుని సినిమా తీయడానికి ఇండియా వచ్చేశాను. నేను సినిమా ఫీల్డ్ లోకి రావడం నా కుటుంబానికి ఇష్టం లేదు. నేను అసలు ఇండియా వచ్చిన సంగతి కూడా వాళ్లకు తెలియదు. అందుకే ఇలా మాస్క్ వేసుకుని తిరుగుతున్నాను. నా ఫ్రెండ్ భరత్ తో కలిసి ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను.

ఈ ది బర్త్ డే బాయ్ మూవీలో 80 శాతం కథ నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో చేసింది. మిగిలిన 20 శాతం కమర్షియల్ హంగుల కోసం కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం. అయినా కూడా నా జీవితంలో జరిగిన వేరే సంఘటనల ఆధారంగా ఆ కథను రాసుకున్నాను. చాలా మంది ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత తమ అభిప్రాయాలు చెప్తున్నారు. సీరియస్ ఇష్యూని కామెడీ చేశాం అంటున్నారు. అయితే ఆ ఘటన జరగక ముందు వరకు మా జీవితాలు చాలా సరదాగా, జాలీగా ఉన్నాయి. మూవీ మీకు మొదటి 15 నిమిషాలు మాత్రమే జోవియల్ గా ఉంటుంది. ఆ తర్వాత అంతా సీరియస్ గా సాగుతుంది.

స్క్రీన్ మీద మీకు కనిపించే ప్రతి ఎమోషన్ ని ఆడియన్ ఫీలవుతాడు. అమెరికాలో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఒక సమస్యలో ఇరుక్కుంటే వాళ్లు ఏం చేశారు అనేదే ఈ సినిమాలో చూపించాం” అంటూ డైరెక్టర్ విస్కీ వ్యాఖ్యానించాడు. అలాగే తన పేరు ఎందుకు విస్కీగా పెట్టుకుంది కూడా చెప్పుకొచ్చాడు. అది తన కుక్కపేలు పేరంట. అది చనిపోతే దాని జ్ఞాపకార్థం ఆ పేరును తాను పెట్టుకున్నట్లు చెప్పాడు. అలాగే తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన మొదటి రెండు సినిమాలు పర్ఫెక్ట్ గా సక్సెస్ కాకపోతే తిరిగి అమెరికా వెళ్లిపోతాను అని డైరెక్టర్ విస్కీ చెప్పుకొచ్చాడు. మరి.. తన రియల్ లైఫ్ సంఘటనలను సినిమాగా తీయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి