రాధే శ్యామ్ – బుల్లితెరపై ఆడిందా?

మాములుగా థియేటర్లలో ఆడని సినిమాలు శాటిలైట్ ఛానల్స్ లో వచ్చినప్పుడు మంచి స్పందన దక్కించుకోవడం చాలాసార్లు జరిగింది. ఇప్పుడంటే ఓటిటిలు వచ్చేసి రేటింగ్స్ తగ్గాయి కానీ లేదంటే జెమిని, స్టార్ మా లాంటి సంస్థలకు కొత్త రిలీజులు బంగారు బాతులా ఉండేవి. అలా అని డిమాండ్ పూర్తిగా తగ్గలేదు. ప్రత్యేకంగా టీవీలో ప్రీమియర్లు వచ్చినప్పుడే చూసే జనం కోట్లలోనే ఉన్నారు.

ఇటీవలే జీ తెలుగులో రాధే శ్యామ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జరిగింది. ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమాకు టిఆర్పి భారీగా వస్తుందనే అంచనాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. తీరా చూస్తే ఇప్పుడీ మూవీ 8.25 రేటింగ్ తో సర్దుకోవాల్సి వచ్చింది. ఇది అర్బన్ ప్రాంతానికి. ఒకవేళ రూరల్ కలుపుకుని యావరేజ్ చేసుకుని చూస్తే కేవలం 6.55 దగ్గరే ఆగిపోయి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.

ప్రభాస్ రేంజ్ కి, రాధే శ్యామ్ ప్యాన్ ఇండియా బిల్డప్ కి ఇది చాలా తక్కువ రేటింగ్. దీనికన్నా ఉప్పెన, జాతరత్నాలు వకీల్ సాబ్ లు గతంలో పది కి పైగా రేటింగ్ ని సాధించడం గమనార్హం. ఇప్పటికీ టాప్ పొజిషన్స్ లో అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, వకీల్ సాబ్, బాహుబలి 2లు ఉన్నాయి. మొత్తానికి రాధే శ్యామ్ బుల్లితెరపై ఏదో మేజిక్ చేస్తుందంటే అక్కడా నిరాశ పరిచి ట్విస్ట్ ఇచ్చింది.

Show comments