iDreamPost
android-app
ios-app

మహేష్ అతిథిగా వచ్చినందుకు ఇన్ని కోట్లా!

  • Published Aug 30, 2022 | 11:20 AM Updated Updated Dec 11, 2023 | 11:29 AM

బ్రాండ్ ఎండార్స్ మెంట్ల కోసం తనను కలిసే సంస్థలు ఎన్ని ఉంటాయో చెప్పడం చాలా కష్టం.

బ్రాండ్ ఎండార్స్ మెంట్ల కోసం తనను కలిసే సంస్థలు ఎన్ని ఉంటాయో చెప్పడం చాలా కష్టం.

  • Published Aug 30, 2022 | 11:20 AMUpdated Dec 11, 2023 | 11:29 AM
మహేష్ అతిథిగా వచ్చినందుకు ఇన్ని కోట్లా!

సూపర్ స్టార్ మహేష్ బాబుకి సినిమాల్లోనే కాదు బయట కూడా ఎంత బ్రాండ్ వేల్యూ ఉందో ఆయన చేసే యాడ్స్ కౌంట్ ని బట్టే చెప్పొచ్చు. యావరేజ్ కంటెంట్ తో సూపర్ హిట్లు సరైన దర్శకుడు దొరికితే బ్లాక్ బస్టర్లు తనకు చాలా మాములు విషయం. బ్రాండ్ ఎండార్స్ మెంట్ల కోసం తనను కలిసే సంస్థలు ఎన్ని ఉంటాయో చెప్పడం చాలా కష్టం. గత పదిహేనేళ్ళకు పైగా ఎన్నో కంపెనీలను మహేష్ ఇచ్చిన ప్రచారం వాటిని కోట్ల స్థాయిలో టర్నోవర్ పెరిగేందుకు కారణమయ్యింది. అయితే ఈ అవకాశాన్ని ఇప్పుడు టీవీ ఛానల్స్ కూడా వాడుకుంటున్నాయి. గతంలో ఓ సీరియల్ పబ్లిసిటీ కోసం మహేష్ ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ రోల్ ఎంత ప్లస్ అయ్యిందో చూశాం.
So many crores for Mahesh's guest appearance!
ఇటీవలే ఒక డాన్స్ రియాలిటీ షోకు అతిథిగా వెళ్ళాడు మహేష్ బాబు. తానొక్కడే కాదు కూతురు సితార పాపను కూడా వెంటబెట్టుకుని హాజరయ్యాడు. ఇందుకు గాను అందుకున్న మొత్తం అక్షరాలా 9 కోట్ల రూపాయలని టీవీ వర్గాల కథనం. దీనికి సంబంధించిన అధికారిక ధ్రువీకరణ లేదు కానీ ఊరికే లీకులు రావుగా. ఈ షోలోనే తను త్రివిక్రమ్ సినిమా కోసం రెడీ చేసుకున్న కొత్త మీసకట్టు మేకోవర్ తో కనిపించబోతున్నాడు. ఇప్పటికే వాటి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ గెటప్ కోసమే షూటింగ్ ప్రారంభోత్సవాన్ని కూడా ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. వచ్చే నెల రెండు లేదా మూడో వారం రెగ్యులర్ షూట్ ఉండనుంది.
So many crores for being a guest!
మొత్తానికి టీవీ షోలకు ఇలా సెలబ్రిటీ జోడింపు మంచి రేటింగ్ తెస్తుంది. ఆ మధ్య ఎవరు మీలో కోటీశ్వరులుకి జూనియర్ ఎన్టీఆర్ యాంకరింగ్ చేసినప్పుడు ఎందరో స్టార్లను స్పెషల్ ఎపిసోడ్స్ కోసం తీసుకొచ్చారు. ఆహా యాప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలేకి చిరంజీవి, బాలకృష్ణ గెస్టులుగా రావడం ఎంత ఆకర్షణ తీసుకొచ్చిందో చూశాం. పదే పదే టీవీ ఆర్టిస్టులను చూపించడం వల్ల ఆడియన్స్ కి బోర్ కొట్టడంతో మహేష్ రేంజ్ స్టార్ వస్తే ఆ లెవెల్ వేరే ఉంటుంది కాబట్టి సదరు ఛానల్ ఇంత మొత్తానికి రెడీ అయ్యిందన్న మాట. సర్కారు వారి పాట ఆశించిన స్థాయిలో కేవలం మహేష్ వల్లే ఆ రేంజ్ వసూళ్లు రాబట్టింది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss